Advertisement
సీనియర్ నటి కుష్బూ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలో కూడా ఆమె గురించి తెలియని వారు ఉండరు కలియుగ పాండవులు మూవీ ద్వారా పరిచయమయ్యారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హీరోగా నటించారు. వెంకీ మొదటి చిత్రం కూడా అదే. హీరోయిన్ పాత్రలు చేసిన తర్వాత ఆమె తల్లిగా, వదినగా, అక్కగా పలు పాత్రలు చేశారు. కొంతకాలం జబర్దస్త్ కి కూడా జడ్జిగా వ్యవహరించారు. కుష్బూ జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలుగా ఉండి ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాలని అలాగే ఆకృత్యాలని ప్రశ్నిస్తూ ఉంటారు.
Advertisement
గోవాలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ జరిగింది. తొలి రోజు కార్యక్రమానికి ఆమె వచ్చి మాట్లాడారు. మహిళలకు ఇబ్బందులు లేని రంగం ఏదీ లేదని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ స్టార్ హీరో తన దగ్గరికి వచ్చి ఏదైనా చాన్స్ ఉందా అని అడిగాడట.
Advertisement
Also read:
వెంటనే తను చెప్పుల సైజు 41 అని చెంప ఇక్కడ పగలగొట్టనా లేకపోతే అందరి ముందు పగలగొట్టనా అని అడిగారట తర్వాత అతను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లు కుష్బూ చెప్పారు. మహిళలకి గౌరవం దక్కే విషయంలో పురుషులతో పాటుగా సమానత్వం లభించే విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని ఆమె అన్నారు. ఇప్పుడు ఆ హీరో ఎవరు అనే చర్చ జరుగుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!