Advertisement
రాజకీయ పరిణామాలు వలన చంద్రబాబుతో జతకట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కూటమిని నడిపించడం.. అలాగే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమయ్యారు. తర్వాత డిప్యూటీ సీఎం పదవిని పొందారు. తాజాగా అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. దీంతో అంతా ఆలోచనలో పడ్డారు దీని వెనుక రాష్ట్ర అధికార కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలు కారణం అవ్వచ్చు అని ప్రచారం జరుగుతోంది. కూటమి ఏర్పడ్డాక చంద్రబాబు కంటే కొడుకు నారా లోకేష్ కి దూకుడు ఎక్కువ అయింది. క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నా కూడా వాళ్లకు అనధికార రిపోర్టింగ్ పాయింట్ లోకేష్ అని ప్రచారం కూడా జరిగింది.
Advertisement
Advertisement
ప్రతి విషయంలో కూడా లోకేష్ ముద్ర స్పష్టంగా కనపడింది, ఈ దూకుడు పవన్ కళ్యాణ్ ని కలవర పెట్టినట్లు తెలుస్తోంది. కూటమి ఏర్పాటులో పవన్ కీలకంగా ఉన్న జనసేన పోటీ చేసిన గెలిచిన స్థానాలు 21 మాత్రమే పవన్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదేళ్లు ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో టీడీపీ ఉంది. లోకేష్ దూకుడు వలన పవన్ కి సహజంగానే కలవరంగా మారిపోయింది.
Also read:
ఐదేళ్ల తర్వాత చంద్రబాబు తప్పుకుని లోకేష్ కి ఆ బాధ్యత అప్పగించవచ్చు అనే వాదన కూడా ఉంది. అసెంబ్లీలో ఇంకో పదేళ్లపాటు చంద్రబాబు సీఎం అన్న మాటను నేరుగా పవన్ చెప్పారు. కాబట్టి చంద్రబాబు లోకేష్ కి ఈ పదవి ఇవ్వరని అర్థమైంది. లోకేష్ దూకుడుకు చెక్ పెట్టేందుకు పవన్ కామెంట్స్ చేసారని చర్చ జరుగుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!