Advertisement
చాలామంది మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే మొబైల్ ఫోన్ ఎంత అవసరంగా మారిపోయింది అంటే ఇక ప్రతిదీ కూడా మొబైల్ ఫోన్ లేకపోతే లేదు అన్నట్లుగా మారిపోయింది. చాలామంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ వైపు చూస్తూ ఉంటారు. అయితే ఉదయం లేవగానే ఫోన్ వైపు చూడడం వలన నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదయం లేవగానే ఫోన్ చూడడం వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. యాంగ్సైటి, ఒత్తిడి వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
అలాగే ఉదయాన్నే లేచి ఫోన్ చూడడం వలన మార్నింగ్ రొటీన్ దెబ్బతింటుంది. రిలాక్స్డ్ గా అనిపించదు. ఇబ్బందిగా ఉంటుంది రోజును ఎప్పుడు కూడా ప్రశాంతంగా మొదలు పెట్టాలి. అలాగే ఉదయాన్నే ఫోన్ చూడడం వలన ప్రోడక్టివిటీ దెబ్బతింటుంది. ఉదయం లేవగానే ఫోన్ చూడడం వలన మీరు ఫ్రస్టేషన్ కి గురవుతారు. అలాగే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
Also read:
మీ ప్రోడక్టివిటీ కూడా బాగా తగ్గుతుంది. ఉదయం లేవగానే మీరు సరైన పోస్టర్లో కూడా లేకుండా ఎక్కువ సేపు ఫోన్ చూడడం వలన మెడ నొప్పి, నడుం నొప్పి ఇలాంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఉదయాన్నే లేచి ఫోన్ చూడడం వలన మీ ఇంట్లో వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. కనీసం వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఫోన్లలో మునిగిపోతే వాళ్ళు చాలా బాధపడతారు ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా తగ్గిపోతుంది.