Advertisement
మనం దేనిని ఫాలో అవ్వాలన్నా ముందు టైం ని ఫాలో అవుతాం. ఆ టైం కి ఇది చేయాలి..? ఆ టైం కి అది చేయాలని.. టైం కి ప్రయారిటీ ఇస్తూ ఉంటాము. అయితే టైమ్ ఎంత అని చెప్పినప్పుడు నైన్ ఓ క్లాక్, సెవెన్ ఓ క్లాక్… ఇలా ఓ చెప్తాము. ఓ అంటే ఏంటి అసలు టైం చెప్పేటప్పుడు ఎందుకు ఓ క్లాక్ అని చెప్తాము..? దాని వెనక కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఎవరైనా టైం అడిగితే 9 ఓ క్లాక్, 5 ఓ ఓకే అయిందని లేదంటే 3 ఓ క్లాక్ అయిందని ఇలా చెప్తూ ఉంటారు.
Advertisement
ఏంటి ఓ క్లాక్ అంటే..? అసలు దీని వెనక కారణం ఏంటి..? ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం.. గడియారాలు లేనప్పుడు ముందు సూర్యుడిని చూసి టైం ఎంతో తెలుసుకునేవారు. తర్వాత నెమ్మదిగా గడియారాలు పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లు అయిన చర్చ్, టౌన్ స్క్వేర్స్ వంటి చోట గడియారాలు ఉండేవి.
Advertisement
Also read:
టైం చూసి టైం ఆఫ్ ద క్లాక్ అని చెప్పేవారు. 15వ శతాబ్దంలో ఆఫ్ ద క్లాక్ ని కాస్త.. ఓ క్లాక్ కింద మార్చారు. తర్వాత ఓ క్లాక్ అనేది అలా కంటిన్యూ అవుతోంది. 1326లో కాంప్లెక్స్ మెకానికల్ క్లాక్స్ వచ్చాయి. అలా గడియారాలు మారుతూ వచ్చాయి కానీ ఈ ఓ క్లాక్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు కూడా టైమ్ ఎంత అంటే మనం కూడా ఓ క్లాక్ ఆని యూజ్ చేస్తూ ఉంటాము