Advertisement
పెళ్లి గురించి అంతా ఎన్నో కలలు కంటూ ఉంటారు. చేసుకోబోయే వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా ఊహించుకుంటూ ఉంటారు. వైవాహిక జీవితం బాగుండాలని.. జీవిత భాగస్వామి మంచివాడై ఉండాలని దేవుళ్ళని కూడా చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. అయితే పెళ్లికి సంబంధించి చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే..? పెళ్లి వయసు. ఏ వయసుకు పెళ్లి చేసుకుంటే మంచిది అనే దాని గురించి చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కొంతమంది త్వరగా 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంటే.. కొంతమంది 30, 40 దాటినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు. వయసు అయిపోయిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం తెగ ఆరాటపడుతున్నారు. అయితే పెళ్లికి ఎంత వయసు ఉంటే మంచిది అనే దాని గురించి తెలుసుకోవడం ముఖ్యం.
Advertisement
Advertisement
పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు కమ్యూనికేషన్ ని బాగా పెంపొందించుకోవాలి. ఒకళ్ళ భావాలని ఇంకొకరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ఏ లక్ష్యాలు ఉన్నాయో వాటిని కాబోయే భాగస్వామికి చెప్పాలి. అలాగే వారి గురించి కూడా అడిగి తెలుసుకోవాలి. పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో సౌకర్యవంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వాళ్ళ మద్దతు మీకు ఉంటుందా అనేది తెలుసుకోవాలి. వ్యక్తిగత అభిప్రాయాలు, కుటుంబం గురించి, జీవనశైలి, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా తెలుసుకునే నిర్ణయం తీసుకుంటే మంచిది.
Also read:
20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది అలాంటి పెళ్లిళ్లలో విడాకులు అవకాశాలు తక్కువగా ఉంటాయి. 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకున్నట్లయితే వారికి ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. ఎలాంటి భాగస్వామిని కోరుకుంటున్నారు అనే దాని గురించి స్పష్టత ఉంటుంది. వ్యక్తిగత విలువలు లక్ష్యాలు వంటి వాటిపై అవగాహన ఉంటుంది. పిల్లల్ని కనే విషయంలో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్ళల్లో సమస్యలు ఉంటాయి కాబట్టి 30 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం మంచిదని సైన్స్ చెప్తోంది.