Advertisement
ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని అనుకుంటారు. మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెడతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయడం మంచిది. వీటిని ఫాలో అవ్వడం వలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మెదడు పనితీరు కూడా బాగుంటుంది. వ్యాయామం చేయడం వలన హెల్తీగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా పొందవచ్చు. ధ్యానం, జాకింగ్, నడక చాలా మంచివి. అలాగే జర్నలింగ్ చాలా మంచిది. ఇది క్రియేటివిటీని పెంచుతుంది.
Advertisement
భావోద్వేగాలను నియంత్రించడానికి కూడా సహాయం చేస్తుంది. మీ లక్ష్యాల గురించి, ప్రణాళికల గురించి పది నిమిషాలు కేటాయించి రాసుకోవడం వలన ఆలోచనాశక్తిని పెంచుకోవచ్చు. మెదడు పదును పెట్టడానికి సుడోకు బాగా ఉపయోగ పడుతుంది. 15 నిమిషాలు దీని కోసం మీరు కేటాయించారు అంటే మీ మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడుకు సాన పెట్టినట్టు అవుతుంది.
Advertisement
Also read:
అలాగే జిక్సా పజిల్స్ వంటి వాటిని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. పుస్తకాలను చదివితే జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు ఎలాంటి పుస్తకాన్ని అయినా కాసేపు చదివితే ప్రశాంతత కలుగుతుంది. పాజిటివ్ థింకింగ్ వలన కూడా మెదడు పనితీరుని మెరుగుపరుచుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటిని ఫాలో అవ్వడం వలన మెదడులో నరాలు రిలాక్స్డ్ అవుతాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది అలాగే మంచి నిద్ర కూడా మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది.