Advertisement
ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ఉసిరికి దూరంగా ఉండాలి. ఉసిరిని తీసుకోవడం వలన వాళ్ళు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలు ఉంటే మాత్రం ఉసిరిని అసలు తీసుకోవద్దు. లేదంటే అంతే సంగతులు అని గుర్తు పెట్టుకోండి. ఉసిరిని తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అవుతుంది. విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఉసిరిని తీసుకుంటే రోగి నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఉన్నట్లయితే ఉసిరికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
ఈ సమస్యలు ఉంటే కనీసం ఉసిరిని తీసుకోవద్దని అంటున్నారు. ఉసిరిలో విటమిన్స్ రక్తం పల్చబడేటట్టు చేస్తుంది రక్తం పల్చగా ఉన్న వాళ్ళు ఉసిరిని తినకూడదు అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆక్సిలేట్ మోతదు ఎక్కువ ఉసిరిలో ఉంటుంది దీంతో కిడ్నీలో రాళ్ల ముప్పు పెరిగిపోతుంది. కిడ్నీ రోగుల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వారు కూడా ఉసిరిని తీసుకోకుండా ఉండడమే మంచిది.
Also read:
ఉసిరిని తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది కానీ హై బీపీ మందులు ఉపయోగించే వాళ్ళు ఉసిరిని అసలు తీసుకోవద్దు డయాబెటిస్ వాళ్ళు ఉసిరిని తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కనుక షుగర్ ఉన్న వాళ్ళు ఉసిరిని తీసుకోవద్దు. ఉసిరి రుచి కాస్త పుల్లగా ఉంటుంది ఎక్కువగా రోజు తీసుకోవడం వలన కడుపునొప్పి ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.