Advertisement
ఇంకో నాలుగు రోజుల్లో నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ క్రమంలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చైతన్య శోభితతో పరిచయం ఎక్కడ ఏర్పడిందనే దాని గురించి, శోభిత కుటుంబం గురించి ఎన్నో విషయాలని చెప్పారు. శోభిత కూడా నాగచైతన్య ప్రేమలో పడడం గురించి చెప్పుకొచ్చారు. శోభిత నాగచైతన్యతో ప్రేమలో ఎలా పడ్డారు అనే దాని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. చైతన్య శోభిత ఓటీటీ షోలో కలుసుకున్నారు.
Advertisement
Advertisement
అప్పుడే వారిద్దరికీ పరిచయం ఏర్పడిందట. పరిచయం ఏర్పడ్డాక నాగచైతన్య వ్యక్తిత్వం తనకు నచ్చిందని ఆయన చాలా కూల్ గా కామ్ గా ఉంటారని.. ఏ విషయానికి కూడా ఆవేశపడే మనస్తత్వం కాదని ఆమె చెప్పారు. చాలా సింపుల్ గా ఉంటారని ఎలాంటి ఆడంబరాలకి పోరని ఆమె చెప్పారు .ఈ విషయాలు ఎంతగానో నచ్చడమే కాదు ఆయనతో ప్రేమలో పడేటట్టు చేశాయని శోభిత చెప్పారు.
Also read:
నాగచైతన్యలో ఉన్న ఈ లక్షణాలు తనతో ప్రేమలో పడ్డానికి కారణమని ఆమె అన్నారు. శోభిత చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీన వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ మధ్య హల్దీ వేడుకని కూడా నిర్వహించారు ఒకే చోట హల్దీ వేడుకతో పాటుగా ఎంతో సాంప్రదాయబద్ధంగా మంగళ స్నానాలను కూడా చేయించారు డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు చైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు.