Advertisement
సీఎం రేవంత్..రాజకీయాల్లో అసామాన్యుడిలా ఎదిగిన ప్రస్థానం ఆయన సొంతం.అయితే, సీఎం అయినా తన వైఖరిలో ఎలాంటి మార్పు రాదని, మునుపటిలాగే అందర్నీ కలుస్తానని, కేసీఆర్ లా తనకు అహంకారం ఉండదని చెప్పుకొచ్చారు. కానీ, గుమ్మడి నర్సయ్యకు రేవంత్ అపాయింట్మెంట్ దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
Advertisement
గుమ్మడి నర్సయ్య… పరిచయం అక్కర్లేని పేరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నర్సయ్య పోడు భూముల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా దక్కలేదు. ఫలితంగా ఆయన మీడియా ముందుకు వచ్చేశారు.
ఎర్రటి ఎండలో రేవంత్ ఇంటి ముందు నిల్చున్నారు. ప్రజా సమస్యలను చెబుతానని పడిగాపులు కాశారు. సీఎం కాన్వాయ్ నర్సయ్యను చూసి, చూడనట్టు వెళ్ళిపోయింది. తన ప్రయత్నాలు వికటించడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
ప్రజా సమస్యలను నివేదిస్తాం అంటే అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దీన్ని బీఆర్ఎస్ హైలెట్ చేస్తోంది. అదే సమయంలో విమర్శలను ఎదుర్కొంటోంది. నర్సయ్యను గద్దర్ తో పోల్చుతూ, కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు బీఆరెస్ సోషల్ మీడియా హడావిడి చేస్తోంది. అయితే, ప్రజా సమస్యలపై ఎవరూ, ఎప్పుడు వచ్చినా తన ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పి..రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది.
దీంతో.. కేసీఆర్ తరహాలోనే రేవంత్ వ్యవహరిస్తున్నారని, పంథా మార్చుకోవాలని పెదవి విరుపులు మొదలయ్యాయి. ఇప్పుడైనా రేవంత్ నుంచి గుమ్మడికి పిలుపు అందుతుందో లేదో చూడాలి.