Advertisement
ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లడం కూడా వార్తే కావడం దురదృష్టకరం. ఏపీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్ అసెంబ్లీకి వెళ్తున్నారని ప్రకటన బిగ్ న్యూస్ గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత జగన్ అసెంబ్లీకి వెళ్లడం.. అపొజిషన్ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడుతారు? కూటమి సర్కార్ హామీల వైఫల్యంపై ఎలా నిలదీస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
Advertisement
ప్రకటించినట్లుగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ, ఏమంత సమయం స్పెండ్ చేయకుండానే తిరిగి వెళ్ళిపోయారు. 11మంది ఎమ్మెల్యేలతో 11నిమిషాలు అసెంబ్లీలో ఉండి వాకౌట్ చేశారు. జగన్ ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆ తర్వాత అది జరగని, కుదరని పని అనుకున్నారేమో వెంటనే సర్దుకున్నారు.
Advertisement
వాస్తవానికి, జగన్ కు ఈ అసెంబ్లీ సమావేశాలు మంచి ఆవకాశం. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయలేకపోతుంది. ప్రజల్లో కూడా ప్రభుత్వంపై ఓ రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో హామీలను నెరవేర్చకపోవడంపైనిలదీయాల్సిందిపోయి..వెన్నుచూపడం జగన్ కు, వైసీపీ ఫ్యూచర్ కు ఏమంత మంచిది కాదు. అనర్హత వేటు పడకుండా ఉండేందు కోసం అలా వచ్చి, ఇలా వెళ్లారని కూటమి నేతల వాదనలకు బలం చేకూర్చినట్టు అవుతుంది.