Advertisement
మరో ఐదు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులపై సభలో చర్చించిన అనంతరం, ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు.
Advertisement
అయితే, ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్..పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన రూట్ మ్యాప్ ను వివరించారు. త్వరలోనే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని, ఇక కాస్కో రేవంత్ అని హెచ్చరికలు పంపారు.
Advertisement
దీంతో కేసీఆర్ గేర్ మార్చారనేది బీఆర్ఎస్ వర్గాల మాట. అంటే ఇక ఫామ్ హౌజ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి..ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యక్షేత్రంలోకి దిగనున్న కేసీఆర్…అసెంబ్లీకి వస్తారా? కీలకమైన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని వినిపిస్తారా? చూడాలి.