Advertisement
బీఆర్ఎస్ రాజకీయాలు మరీ కామెడీగా మారుతున్నాయి. ఆ పార్టీ టార్గెట్ ఒకటే..రేవంత్ ను బలహీనం చేయడమే. అందుకోసం సిల్లీ రాజకీయాలను ప్రచారంలో ఉంచుతోంది. ఇందుకోసం రాహుల్ – రేవంత్ మధ్య మనస్పర్థలు వచ్చాయని , రేవంత్ వైఖరితో రాహుల్ సంతృప్తిగా లేరనేది బీఆర్ఎస్ కొన్నాళ్లుగా చేస్తున్న విమర్శ. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ పై హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారనేది బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ లో భాగంగా తరుచు చర్చలో ఉంచుతున్న వార్త.
Advertisement
నిజంగా రేవంత్ పై రాహుల్ ఏమాత్రం సంతృప్తిగా లేకపోతే, ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తిగా ఉంటే రేవంత్ పదవి ఊడపీకడం ఎంతసేపటి పని? పైగా..అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారని, అందుకు అసంతృప్తియే కారణమని చెబుతున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా రేవంత్ తనే విసిగి సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లాలనే అమయకత్వంతో రాహుల్ రాజకీయాలు ఉంటాయా? ఇక్కడే బీఆర్ఎస్ వ్యూహాత్మక రాజకీయాలు తేలిపోతున్నాయి.
ఇక తాజాగా ప్రధానితో రేవంత్ భేటీ కావడంపై బీఆర్ఎస్ కు ఎలా స్పందించాలో తెలియనట్టుంది. ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ సహకరిస్తే 48గంటల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును జైల్లో వేస్తామని ప్రకటించిన రెండు రోజులకే ప్రధానితో భేటీ బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరి భేటీపై కొత్త తరహా భాష్యం చెప్పుకొచ్చిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Advertisement
ప్రధానితో భేటీ అయితే ఫొటోస్ బయటకు వచ్చాయి. ఇటీవల చాలా రోజుల తర్వాత రాహుల్ తో భేటీ అయిన రేవంత్ ఫొటోస్ ఎందుకు బయటపెట్టలేదు..అంటే రేవంత్.. రాహుల్ ను కలిసినదాంట్లో ఎలాంటి నిజం లేదు..నమ్మించడం కోసమే అబద్ధం చెప్పారనేది బీఆర్ఎస్ కొత్త వాదన.అన్నిసార్లు అన్ని ఫొటోస్ బయటకు విడుదల చేయరు. ఈ విషయం పదేళ్లు పవర్ లో ఉండిన పార్టీకి తెలియదా? అయినా..ప్రధానితో రేవంత్ భేటీ సందర్బంగా రాహుల్ తో రేవంత్ సమావేశం బూటకం అనే వాదనను ఎందుకు తీసుకొస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు..
రేవంత్ పాలిటిక్స్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అవుతోంది. ప్రధానితో రేవంత్ భేటీ సందర్బంగా ఎన్నో అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి. ఆ రాజకీయాల గురించి కాకుండా.. రాహుల్ – రేవంత్ ఫొటోస్ ఎక్కడా అంటూ పసలేని పాయింట్ తో రేవంత్ ను దెబ్బకొట్టాలని చూస్తుంది బీఆరెస్. కానీ, ఇవి బీఆర్ఎస్ ఎలాంటి లాభం చేస్తాయో కానీ, నష్టం మాత్రం చేస్తాయనంటున్నారు.