Advertisement
జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాహుబలి రెండు పార్టులుగా వచ్చిన విషయం అందరికి తెలిసిందే.. బాహుబలి మరియు బాహుబలి 2 పేరిట ఈ మూవీ రెండు పార్టులుగా వచ్చి ప్రేక్షకులను ఎంతో అలరించింది. కానీ ఇందులో ఒక చిన్న విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరూ గమనించలేదు.. అది ఏమిటి అంటే.. మొదటి పార్టు లో శివుడు ( మహేంద్ర బాహుబలి ), అవంతిక లు ఒక ప్రదేశంలో సరదాగా గడుపుతూ ఉంటారు.. అక్కడే ఒక చక్కని సాంగ్ కూడా ఉంటుంది. అయితే ఆ ప్రదేశం ఏంటో మీకు తెలుసా..
Advertisement
దేవసేన యొక్క రాజ్యం కుంతల.. బళ్లాలదేవుడు ఆ రాజ్యంపై దండెత్తి దాన్ని నాశనం చేస్తాడు.. దీంతో ఆ రాజ్యానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మిగిలిపోతాయి.. అక్కడే అవంతికతో శివుడు ప్రేమాయణం నడిపిస్తారు. అవంతిక బ్యాక్ గ్రౌండ్ లో ఈ శిథిలాలను మనం క్లియర్ గా చూడవచ్చు. కుంతల రాజ్యం అనేది తెల్లని రాయిపై నిర్మించబడి ఉంటుంది.. కాబట్టి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు.. అలాగే బాహుబలి 2వ పార్ట్ లో దేవసేన రాజ్యాన్ని కూడా మనం ఈజీగా చూడవచ్చు. అక్కడే అవంతిక మరియు శివుడు ప్రేమగా గడుపుతారు.
Advertisement
ఆ రాజ్యం మొత్తం తెల్లని మార్బుల్ రాయితో కనబడుతుంది.. ఆ రాజ్యం నాశనం చేయక ముందు మరియు చేసిన తర్వాత మనం దానిని క్లియర్ గా గమనించవచ్చు. కాని దీన్ని ఇప్పటివరకు ఎవరూ కూడా గమనించలేదు.. రెండు ఫోటోలలో కూడా హంసలకు చెందిన రెండు విగ్రహాలు ఉంటాయి. ఇవి ఆ కుంతల రాజ్యానికి ప్రత్యేక చిహ్నాలు. వాటిని మనం క్లియర్ గా చూడవచ్చు. అంటే బాహుబలి మొదటి పార్ట్ లోనే కుంతల రాజ్యం మనకు కనిపించింది అన్నమాట.
ALSO READ;
టాలీవుడ్ మొత్తం అడిగినా కూడా వెంకటేష్ ఆ పని చేయరట !