Advertisement
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను S.I.V సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది.
Advertisement
READ ALSO : వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!
Ramarao on duty review#కథ మరియు వివరణ:
రామారావు ఆన్ డ్యూటీ లో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించాడు. అతని పాత్ర ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది. అయితే రవితేజ ఏదో విషయంలో సబ్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ సమయంలో రవితేజ తన ఊరిలో కొందరు మిస్సింగ్ అయిన విషయాన్ని తెలుసుకుంటాడు. వారందరిని కాపాడుకునే క్రమంలో రవితేజ ఎలాంటి స్టెప్పులు వేశాడు, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
Advertisement
డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్ లో హై వోల్టేజ్ మాస్ డైలాగ్స్ తో మాస్ మహారాజా అదరగొట్టేశాడు. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో రవితేజ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. సాంగ్స్ యావరేజ్ గా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. శరత్ మండవకు డైరెక్టర్ గా ఇది తొలి సినిమానే అయినా, రవితేజను సరికొత్తగా చూపించాడని, కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రవితేజ నుంచి ఊహించే సినిమా కాదని, ఆయన్ని పూర్తిగా ఆవిష్కరించలేదని కూడా చెప్పాలి. దర్శకుడు కొంత పదును పెట్టి ఉంటే బాగుండేది.
#ప్లస్ పాయింట్స్:
రవితేజ యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సన్నివేశాలు
#మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లాగ్
రోటీన్ కథనం
క్లైమాక్స్
#రేటింగ్: 3/5
also read: నిమాలకు దూరమైన హీరోయిన్ దీక్షాసేత్…! ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా..?