Advertisement
ముక్కుసూటి మనిషిని, ప్రజాసేవలో గాంధీని అంటూ చెప్పుకుంటూ తిరిగే బెజవాడ బడా రాజకీయ నేత ఎంపీ కేశినేని నాని నిజరూపం బయటకు వచ్చింది.. ఇన్నాళ్లు ఆయనను ఒక వైపు చూసిన ప్రజలు ఈ విషయం బయటకు రావడంతో చాలా ఆశ్చర్య పోతున్నారు.. అసలు విషయం ఏంటయా అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేసినేని కార్గో, క్యారియర్ అనే కంపెనీ పేరుతో కోట్ల రూపాయల లోన్ తీసుకొని డబ్బులు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారట. ఇంత పెద్ద మనిషి డబ్బులు చెల్లించక తిరగడం, ఒకవేళ అడిగినా సదరు ఎంపీ గారు స్పందించకపోవడంతో debt రికవరీ ట్రిబ్యునల్లో కేస్ వేశారంట బ్యాంక్ సిబ్బంది.
Advertisement
బ్యాంకు వారు ఎన్ని సార్లు నోటీసులు పంపించిన నోటీసులు తీసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారట. నోటీసులు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అంటూ మాయ మాటలు చెబుతూ ఉంటున్నారని బ్యాంకు సిబ్బంది తెలియజేశారు. అయితే నోటీస్ తీసుకొని కూడా ప్రతి ఉత్తరం రాశారు నాని.. దీంతో సదరు బ్యాంకు కేసినేని నాని నోటీసులు అన్ని ప్రధాన దినపత్రికల్లో ప్రకటించింది.. అసలు విషయానికి వస్తే నాని ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నారని తెలుస్తోంది. కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడానికి డబ్బు లేని పరిస్థితి, వ్యక్తిగత సిబ్బంది కూడా అరకొర జీతాలు ఇస్తూ, అప్పులు ఇచ్చిన వారి ఫోన్ ఎత్తకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తోంది.
Advertisement
విజయవాడ ఎంపీ కేశినేని నాని కీ ఒక విజయవాడ లోనే కాకుండా ఆల్ ఇండియా లో ఎక్కడ కొత్త అప్పులు పుట్టక పోవడంతో తలపట్టుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కురుకు పోవడంతో ఎవరికీ కనబడకుండా దూరంగా ఉంటున్నారని అందుకే బ్యాంకు నోటీసులు కూడా తీసుకోవడం లేదని సమాచారం. ఆయన యొక్క బ్యాంకు లోనే కాకుండా అనేక బ్యాంకుల్లో కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అప్పులు కుప్పలు గా ఉన్నాయని ఇప్పట్లో వీటన్నిటిని తీర్చడం కష్టమేనని తెలుస్తోంది. టాటా, బిర్లాకి దగ్గర అని చెప్పుకుని తిరిగే ఈ పెద్దమనిషి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని బెజవాడలోని కేశినేని అంతరంగికులే చర్చించుకుంటున్నారు. ఈ కేసును మాఫీ చేయించు కోవడానికి ఎంపీ పదవిని వాడుకుంటున్నారని కూడా బెజవాడ కోడైకూస్తోంది.
ALSO READ:
వెంకటేష్ తన 35 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు వదులుకున్నారో తెలుసా..?