Advertisement
అత్యధిక సంపన్నుల జాబితాలో పేరు ఉందంటే వారు ఏ వ్యాపారవేత్తలో, సినీ ప్రముఖులో, క్రీడాకారులో లేదా రాజకీయ నాయకులో అనుకుంటారు. కానీ భారత్ లో అత్యంత సంపద కలిగిన వారిలో 14% మంది వేతనాలు తీసుకునే వారే అంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే, భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళలు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషిని నాడార్ మల్హోత్రా దేశంలో నంబర్ 1 ధనవంతురాలిగా ఎదిగారు. దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ రోషిని కావడం విశేషం. 2021 నాటికి ఆమె నికర విలువ 54% పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకొని భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్-హురున్ జాబితా ప్రకారం, ఒక దశాబ్దం క్రితం అందం పెంచే ఉత్పత్తుల బ్రాండ్ ‘నైకా’ ను ప్రారంభించి, తన బ్యాంకింగ్ కెరీర్ ను విడిచిపెట్టిన ఫల్గుణి నాయర్ దేశంలోనే అత్యంత సంపదన పరులైన మహిళల్లో సంపాదన పరులైన మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు.
Advertisement
బయోకాన్ కి చెందిన కిరణ్ మంజుధార్-షా మూడో స్థానంలో ఉన్నారు. ఈమె సంపద 21 శాతం క్షీణించింది. రూ.29,030 కోట్ల సంపదతో దేశంలో మూడవ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గతంలో కంటే ఒక ర్యాంకు దిగజారారు. ఈ జాబితాలో దివిస్ లేబోరేటరీస్ కు చెందిన నీలిమ మోటపర్తి రూ.28, 180 కోట్లు సంపదతో 4వ స్థానంలో నిలిచారు.
జోహోకు చెందిన రాధా వెంబు (రూ.26, 620 కోట్లు) తో 5వ స్థానంలో, యు ఎస్ వి కి చెందిన లీనా గాంధీ తివారి (రూ.24,280 కోట్లు) తో 6వ స్థానంలో ఉన్నారు. ధర్మాక్సు కు చెందిన అను అగా మరియు మెహెర్ పుదుంజి ( రూ.14, 530 కోట్లు) సంపాదనతో 7వ స్థానంలో నిలిచారు.
ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?