Advertisement
శీతాకాలంలో మాత్రమే పండే సీజనల్ ఫ్రూట్స్ రేగి పండ్లు. భోగి పండుగకు పిల్లలపై భోగి పండ్లు గా కూడా రేగి పండ్లనే వాడతారు. సంక్రాంతి పండుగ భోగి నుండి ప్రారంభమై కనుమతో ముగుస్తుంది. దీనిలో ఒక్కో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. భోగి రోజు భోగి మంటలు వేసి, అందమైన రంగవల్లులతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరిస్తారు. అయితే భోగి రోజు 5 ఏళ్లలోపు పిల్లలపై రేగు పండ్లు పోస్తారు. వీటినే భోగి పళ్ళు అంటారు. అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది. దీనివల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Advertisement
సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్ద వారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగు పళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలని తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. సాక్షాత్తు నారాయణుడు ఈ బదరి వృక్షం (రేగు చెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాలని తింటూ తన తపస్సుని కొనసాగించాడని, దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను పిల్లలపై పోస్తే, సాక్షాత్తు నారాయణుడే దీవించినట్టు అని నమ్మకం. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగు పళ్ళు అందుబాటులోకి రావడం కూడా ఈ సాంప్రదాయం కొనసాగడానికి కారణం.
Advertisement
రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించింది. అందుకు దీన్ని ‘ఇండియన్ డేట్స్’ అని పిలుస్తారు. రేగు చెట్టు 15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైన తట్టుకొని నిలబడుతుంది. రేగుపళ్ళలో ‘సి’ విటమిన్ అధికం. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రేగుపళ్ళతో పాటు, బంతిపూల రెక్కలని వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే క్రీములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూల కి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే.
ALSO READ : గ్లామర్ కంటే నటనకు ప్రాముఖ్యత ఇచ్చి, స్టార్లు అయిన హీరోయిన్లు!