• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 04.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 04.08.2022

Published on August 4, 2022 by Bunty Saikiran

Advertisement

నిత్యజీవితంలో రాశి ఫలాలు ఒక భాగం అయిపోయాయి. అయితే కొంతమంది వీటిని నమ్మితే..మరి కొంతమంది నమ్మడం లేదు. అయితే ఇవాళ వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.మకర రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెలుస్తాయి. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారి గా దిన ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేషం:- ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు అధికమవుతాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.

వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు.

Rashi Phalalu in Telugu

ALSO READ; చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?

మిధునం:- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఋణం తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికం. విద్యార్థులకు పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

కర్కాటకం:- ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలు సున్నితంగా తెలియజేయండి. తొందరపడి హామీలివ్వవద్దు. వాగ్వాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.

సింహం:- ఆర్థిక వ్యవహరాల్లో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. దైవదర్శనాల వల్ల ప్రశాంతత పొందుతారు. అస్థిరమైన నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.

ఈ రోజు రాశి ఫలాలు

Advertisement

కన్య: – ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కార్యసాధనకు లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవటం క్షేమం కాదు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి.

తుల: – విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. సాంస్కృతిక, కళారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎరువులు, విత్తన వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. రుణభారం పెరిగే సూచన ఉన్నది. ఆచితూచి అడుగులు వేయటం మంచిది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. అధికారులకు పర్యటనలు, ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం.

వృశ్చికం:- రావలసిన ధనం వసూలు విషయంలో జాప్యం తప్పదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఓర్పు, పట్టదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు.

ధనస్సు: – ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటాయి. విదేశాలు, దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం:- వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను వీడనాడి శ్రమించడం శ్రేయోదాయకం. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.

కుంభం:- వృత్తి వ్యాపారులకు శుభదాయకం. ఔషధసేవనం తప్పకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. తలచిన పనులు వెంటనే పూర్తి చేయగలుగుతారు. గృహంలో శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో మెళుకువ అవసరం. ముఖ్యలరాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది.

మీనం:- స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెళకువ వహించండి. బంధు మిత్రుల మధ్య అనుబంధాలు బలపడతాయి. కీలమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. మిత్రుల కిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు.

 

Related posts:

Today Horoscope in Telugu 2022Weekly Rashi Phalalu in Telugu : వీక్లీ రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి శుభవార్త Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 15.09.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 29.09.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 13.10.2022

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd