Advertisement
సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుపొంది ఎన్నో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకుంది హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ శ్రీదేవి ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యేది. అయితే చాలామంది ఇండస్ట్రీలో శ్రీదేవి వల్ల లాభ పడ్డ వారే కానీ నష్టపోయిన వారు ఎవరూ లేరు. కానీ శ్రీదేవి వల్ల మెగాస్టార్ చిరంజీవి మాత్రం నష్టపోయారు.. మరి అది ఎలాగో ఒకసారి చూడండి..
Advertisement
వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయం. లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. ఈ టైం లోనే చిరంజీవి తో సమానంగా క్రేజ్ పెంచుకుంది శ్రీదేవి. ఆమె సినిమాల్లో ఉంటే చాలు సినిమా హిట్ అనే టాక్ నడుస్తున్న సమయం. దీంతో మూవీ మేకర్స్ చాలామంది శ్రీదేవి కోసం బారులు తీరేవారు. ఇందులో చాలామంది మేకర్స్ చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ లో సినిమాలు చేయాలని భావించారు. కానీ శ్రీదేవి చిరంజీవి తో నటించడానికి ఎన్నో అభ్యంతరాలు తెలిపేది. ఒక్కోసారి సినిమా ఒప్పుకున్న తర్వాత కూడా వివిధ కారణాలు చెప్పి తప్పుకునే దట. ఈ విధంగా శ్రీదేవి కారణంగా ఆగిపోయిన చిరంజీవి సినిమాలు చూద్దాం..
Advertisement
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి చిరంజీవి కలయికలో వజ్రాల దొంగ సినిమా కథ రెడీ అయింది. దీనికి శ్రీదేవి నిర్మాత. త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనగా శ్రీదేవి ఒక మెలిక పెట్టి, దీనికి నిర్మాత నేనే కాబట్టి చిరంజీవి పాత్ర కన్నా నా పాత్ర ఎక్కువగా వచ్చేలా కథ మార్చాలని చెప్పారట. ఇలా చిరంజీవి లాంటి స్టార్ హీరో ని తగ్గించి చూసేసరికి దర్శకుడు ఒప్పుకోలేదట. దీంతో ఈ మూవీ ఆగిపోయింది. చిరంజీవి మరో హిట్ మూవీ కొండవీటి దొంగ. ఈ మూవీలో కూడా ముందుగా శ్రీదేవి హీరోయిన్ అనుకున్నారట. దీంతో శ్రీదేవి మళ్లీ మెలిక పెట్టి చిరంజీవి తో సమానంగా నాక్కూడా ఫైట్స్ పెట్టాలని శ్రీదేవి డిమాండ్ చేయడంతో, కొండవీటి దొంగ స్థానంలో కొండవీటి రాణి అని టైటిల్ మార్చాలని చెప్పిందట. దీంతో ప్రాజెక్టు నుంచి శ్రీదేవిని తప్పించి హీరోయిన్స్ గా రాధ, విజయశాంతి లను తీసుకున్నారట దర్శకులు. తర్వాత కొండవీటి దొంగ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ALSO READ;
సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!