Advertisement
Rashi Phalalu in Telugu 09.08.2022: ఇవాళ మంగళ వారం… రోజున అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశిని వరిస్తుంది. వారి గ్రహస్థానాల మధ్య ఈ రోజు రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఇలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Advertisement
Rashi Phalalu in Telugu 09.08.2022
మేషం :- పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది.
వృషభం :- ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయానయత్నం ఫలిస్తుంది. స్త్రీలకు చేతిపనులు, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.
మిథునం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు.
కర్కాటకం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. నిరుద్యోగులు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
ఈ రోజు రాశి ఫలాలు 09.08.2022
సింహం :- పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఆదాయం పెరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.
కన్య :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. వ్యపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి.
Advertisement
తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. చిన్నారుల వైఖమనస్తాపం కలిగిస్తుంది. వాహన చోదకులకు దూకుడు తగదు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది.
వృశ్చికం :- ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు.
ధనస్సు :- ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. విదేశాయానం కోసం చేసేయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవటం శ్రేయస్కరం.
మకరం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి.
కుంభం :- తాపిపని వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. క్రయవిక్రయాలు సామాన్యం.
మీనం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా కృషి చేస్తేనే పెండింగ్ పనులు పూర్తి కాగలవు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుతారు.
ALSO READ: ఈ 10 మంది స్టార్ హీరోలు గజిని సినిమాని వదులుకోవడానికి అసలు కారణం ఇదేనా..?