Advertisement
ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన యువ హీరో ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తన నటనతో అందరినీ కట్టిపడేసి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. ఇండస్ట్రీలోకి ఎంత స్పీడ్ గా ఎదిగాడో అంతే స్పీడ్ గా తెరమరుగై చివరికి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చిరంజీవి తన పెద్ద కూతురు ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
Advertisement
Also Read: చికెన్ పాక్స్ ని ‘అమ్మవారిగా’ లేదా ‘అమ్మ పోసింది’ అని ఎందుకు పిలుస్తారు ?
ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా డీలా పడుతూ వచ్చాడు. ఆ సమయంలోనే వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీని తర్వాత ఆయన వివాహ జీవితంలో కూడా ఏవో సమస్యలు వచ్చాయని ఆ కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. ఈ క్రమంలోనే మెగాఫ్యామిలీపై కూడా విమర్శలు వచ్చాయని, అలాంటి టాలెంటెడ్ యంగ్ హీరో అకాల మరణం పొందడం నన్ను చాలా బాధ పెట్టిందని సీనియర్ నటి సుధ కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ కి చిన్నప్పటి నుంచే తల్లి లేదు. తండ్రి కూడా దూరమయ్యాడు. వివాహ జీవితం కూడా సమస్య ల్లో పడింది. చివరికి ఒంటరి వాడయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉదయ్ కిరణ్ ని చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డేమో అనుకున్నా..
Advertisement
ఆయన సినిమాలు చేస్తాడా చేయడం అనే విషయాలను పక్కన పెడితే ఉదయ్ కిరణ్ బతుకంటే మాత్రం నా ప్రాపర్టీ అంతా ఆయనకే దక్కేది.నాకు కొడుకు అయ్యేవాడు అంటూ ఎమోషనల్ అయింది. ఉదయ్ కిరణ్ ఆ రోజు నన్ను కలవడానికి వచ్చిన సమయంలో ఏడుపు దిగమింగుకొని మరీ వచ్చాడు. నా హెయిర్ డ్రెస్సర్ వద్దకు వచ్చి అమ్మ తో మాట్లాడాలి అని అడిగాడు. దీంతో ఆయన వచ్చాడని చెప్పడంతో, వాడు నన్ను కలవడానికి అడగాలా లోపలికి రమ్మను వాడిని అన్నాను. నేను చైర్ లో కూర్చుని ఉన్నాను. నా పక్కనే చలపతిరావు గారు కూడా ఉన్నారు. రావడం రావడమే నా కళ్ళను గట్టిగా పట్టుకొని ఏడ్చాడు. ఆ విషయం ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను. తనకు నాకు ఏదో జన్మ అనుబంధం ఉందేమో, దేవుడు ఆ అనుబంధాన్ని ఎలా తీసుకు వెళ్లిపోయాడో అని నటి సుధ ఆవేదన వ్యక్తం చేసింది.
also read:
మొదటి సినిమా హిట్టు, రెండో సినిమాతో ఫట్టు అయిన దర్శకులు వీళ్ళే !