Advertisement
ఇప్పటికి మన దేశంలో చాలా విషయాలు సైన్సుకు కూడా అంతు పట్టవు. అలాంటి విషయాలలో ఈ విషయం కూడా ఒకటి. అదేంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో వున్నా మెహతా గ్రామంలో జగన్నాథ్ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను చూసి విదేశీయులు కూడా ఆశ్చర్య పోతున్నారు.
Advertisement
అయితే ఈ ఆలయంలో అతి పెద్ద రహస్యం ఏమిటంటే.. రాబోయే వర్షాన్ని ముందుగానే అంచనా వేసి ఈ ఆలయం చూపిస్తుందని అంటుంటారు. వర్షం వచ్చే ఆరు నుంచి ఏడు రోజుల ముందే ఈ ఆలయ పైకప్పు నుండి నీటి బిందువులు కారడం మొదలవుతుందట. ఆ నీటి బిందువుల పరిమాణం ఎంత ఉంటుందో ఆ విధంగానే వర్షం కూడా కురుస్తుందని ప్రజలు చెబుతుంటారు. ఇది కేవలం వర్షం వచ్చే సూచన ఇవ్వటమే కాకుండా, వర్షం ఎప్పుడు ఆగిపోతుందో కూడా చెబుతుందని అక్కడి ప్రజలు అంటుంటారు. ఇక వర్షం పోతుందనగా ఆలయంలోని పై కప్పంతా పూర్తిగా ఎండిపోతుందని ప్రజలు అంటుంటారు. అయితే ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు?
Advertisement
అనే విషయాన్ని ఇప్పటికి కూడా ఎవరూ చెప్పలేకపోయారని, ఆలయం లోపల జగన్నాథుని విగ్రహం ఉందని, ఆ విగ్రహంలో శ్రీ హరి విష్ణువు ని 24 అవతారాల తో చూడవచ్చని అంటుంటారు. అలాగే ఈ ఆలయ గోపురం పై వృత్తం కూడా ఉందని దీనివల్లే ఇప్పటివరకు ఈ ఆలయం చుట్టు పక్కల ఖగోళ మెరుపులు కూడా పడలేదని చెబుతూ ఉంటారు.. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధమెంతో తెలియదు కానీ అక్కడి ప్రజలు మాత్రం ఇది నిజమనే నమ్ముతారు..
also read: