Advertisement
నందమూరి నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ చిరంజీవి ఇంద్ర సినిమా కు పోటీ గా రిలీజ్ చేశారు. అప్పట్లో వినాయక్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడం, ఈ క్రమంలోనే ఆయన మరో సినిమా బాలకృష్ణ తో చేయడం,సినిమా పేరు పవర్ ఫుల్ గా ఉండటం తో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే సినిమాను హడావిడిగా స్క్రీన్ డిస్ప్లే లోపాలతో రిలీజ్ చేయడంతో ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగా హిట్ కాలేదు.
Advertisement
Advertisement
సినిమా బాగుంది అనే పేరు తప్ప ఇంద్రా సినిమాతో పోల్చుకుంటే చాలా తక్కువ పెర్ఫామెన్స్ ఇచ్చింది అని చెప్పవచ్చు. అయితే చెన్నకేశవరెడ్డి మూవీ సూపర్ హిట్ అవ్వకపోయినా 42 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా టాబు, శ్రీయా నటించారు.. అయితే తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణకు జోడీగా ముందు సౌందర్యను సంప్రదించి కథ చెప్పారట వినాయక్.. అయితే కథ మొత్తం విన్న సౌందర్య ఈ సినిమాను రిజెక్ట్ చేశారట..
సౌందర్య హీరోయిన్ గా నటించినటువంటి చాలా సినిమాలకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ పరిచయంతోనే సౌందర్యకు ఈ కథ చెప్పారని, ఇందులో తండ్రి పాత్రకు జోడీగా నటించాల్సి రావడంతో సౌందర్య ఒప్పుకోలేదని, ఇలాంటి ఓల్డ్ పాత్రలో నటిస్తే దీని తర్వాత కూడా ఆ తరహా పాత్రలే వస్తాయని, అందుకే ఫామ్లో ఉన్న సౌందర్య ఈ పాత్ర చేసి రిస్కు చేయడం ఎందుకని రిజెక్టు చేసిందని సమాచారం.
also read: