Advertisement
ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ప్లాప్స్ నడుమ, మెల్లిమెల్లిగా పుంజుకుంటూ హిట్ బాట పట్టింది. ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీ లోనే చాలా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ విధంగా బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయిక గా రికార్డు సృష్టించింది.. ఈ అమ్మడు రీసెంట్ గా తను ప్రేమించిన కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను వివాహం చేసుకుంది.
Advertisement
వీళ్ళ పెళ్లి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి సమయంలో వీరి హంగామా మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు. పెళ్లి సమయంలో టాప్ సీక్రెట్ గా ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా పెళ్లి పనులు చేసుకొని ఒక్కసారిగా తమిళనాడులోని మహాబలిపురంలో ఒక రిసార్టులో గ్రాండ్ గా వివాహం చేసుకొని తన కలల రాకుమారుడిని దగ్గర చేసుకుంది.. అలాగే వాళ్ల పెళ్లికి సంబంధించినటువంటి వీడియోను ఒక డాక్యుమెంటరీ గా తెరకెక్కించారు. ఈ బాధ్యతలను గౌతమ్ మీనన్ వాసుదేవ్ తీసుకున్నారట..
Advertisement
వీళ్ళ దర్శకత్వంలోనే ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ఈ డాక్యుమెంటరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నయనతార బి అండ్ ది ఫెయిరి టెల్ అనే టైటిల్ తో ఈ డాక్యుమెంటరీ ప్రోమో విడుదల చేశారు.. అయితే ఈ ప్రోమో చాలా షార్ట్ గా ఉంది. దీంతో నయనతార వివాహం కోసం ఆశగా ఎదురు చూసిన అభిమానులు మాత్రం ఫీల్ అయ్యారని చెప్పవచ్చు. ఇందులో మ్యారేజ్ క్లిప్పింగ్స్ అయినా యాడ్ చేయొచ్చుగా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.
also read:
ఇంట్లో చెప్పులు వేసుకొని ఈ పనులు చేస్తే.. జరిగే అనర్ధం ఇదేనా..?