Advertisement
సాధారణంగా కోర్టులలో ఉరి శిక్ష తీర్పు ఇచ్చాక జడ్జ్ పెన్ నిబ్ ను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా.. వివరాల్లోకి వెళితే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి. ఎన్ని రోజులకు ఖైదు ప్రకటించాలనేది ఇండియన్ పీనల్ కోర్ట్ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులు, సామాజిక శిక్ష విధించవచ్చనే మార్గదర్శకాలు ప్రస్తుతం లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కోర్టులు ఈ తరహా తీర్పులను వెలువరిస్తాయి. ఇతరులకు హాని కలిగించేటువంటి ఏ పని అయినా నేరం కిందకే వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇందులో ఒక్కొక్క నేరానికి ఒక్కోక్క శిక్ష ఉంటుంది.
Advertisement
Also Read: లీకైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..ఆ ముగ్గురు టాప్ యాంకర్లకు లక్కీ ఛాన్స్..!!
Advertisement
కొంత మందికి జైలు శిక్ష పడుతుంది. ఇందులో కొంత మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇంకొంతమంది చేసిన నేరాలకు ఏ శిక్ష ఐనా తక్కువే అనిపిస్తుంది. అలాంటి ఘోరమైన తప్పు చేసినప్పుడు విధించేదే మరణశిక్ష. ఈ శిక్ష అనేది క్షమించరాని నేరం చేసినవారికి మాత్రమే విధిస్తారు. మనం చాలా సినిమాల్లో మరణశిక్ష విధించే సీన్లను చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఒక విషయాన్ని మనం గమనించి ఉండాలి.
మరణ శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను మొనను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఈ పద్ధతి ఇప్పుడు మొదలైంది కాదు. బ్రిటిష్ కాలం నుండి పెన్ నిబ్ ని విరిచి వేయడం అనేది పాటిస్తూ వస్తున్నారు. దీన్ని పాటించడానికి చాలా కారణాలున్నాయి. ఒకరి మరణం తీర్పు రాసిన పేరుతో మరోకరి తీర్పు రాయకూడదు. అంతేకాకుండా ఒకసారి తీర్పు ఇస్తే మళ్లీ దాన్ని మార్చడం కానీ పునః పరిశీలించడం గాని జరగదు అనే దానికి సంకేతంగా ఈ విధంగా చేస్తారట.
ALSO READ: ఆ స్టార్ హీరో విడాకుల వార్తపై అదిరిపోయే సమాధానం ఇచ్చిన భార్య..!!