Advertisement
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో టాలెంట్ తో పాటు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ తరువాత సక్సెస్ వస్తే వరుస ఆఫర్లు వస్తాయి. కానీ అలా ఎంతో కష్టపడి సినిమాల్లో సక్సెస్ అవుతున్న క్రమంలోనే కొంతమంది టాలీవుడ్ స్టార్ లు రకరకాల కారణాలవల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఇవి కూడా చదవండి: ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?
#1 సౌందర్య: మరో సావిత్రి లా చక్రం తిప్పుతుంది అనుకున్నారు. చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. కానీ 34 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.
#2 ప్రత్యూష: వరుసగా మంచి అవకాశాలు అందుకుంటున్న టైం లో ఈమె మరణించింది. కొంతమంది ఈమెపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: విక్రమార్కుడు ఆఫర్ వదులుకున్న పవన్ కళ్యాణ్ ?
Advertisement
#3 దివ్యభారతి: స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకున్న టైములో ఈమె మరణించింది. 19 ఏళ్లకే ఈమె మరణించడం విషాదకరం.
#4 యశోసాగర్: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం హీరో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న టైములో అది 25 ఏళ్లకే మరణించాడు.
#5 ఎం.ఎస్.నారాయణ: ఈయన 63 ఏళ్ల వయసులోనే మరణించాడు. కానీ ఆ టైముకి ఈయన స్టార్ కమెడియన్ గా 20 కి పైగా సినిమా ఆఫర్లతో బిజీ గా ఉన్నాడు.
#6 శ్రీహరి: విలన్ గా, హీరోగా రాణించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు శ్రీహరి గారు. కానీ 49 ఏళ్లకే ఈయన మరణించారు.
#7 టి.ఎన్.ఆర్: నటుడిగా, జర్నలిస్టుగా కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ఈయన కరోనాతో మరణించాడు. ఈయన వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే.
Also Read : ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?