Advertisement
ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా హెల్ప్ అయ్యేది టైటిల్. అదిరిపోయే టైటిల్ కానీ పెట్టారంటే చాలు. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆసక్తికరమైన టైటిల్స్ కొన్ని సినిమాలకు ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అవి బయటకు వచ్చిన క్షణం నుంచి కూడా వాటి గురించే చర్చ జరుగుతుంది.
Advertisement
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా తమ సినిమాలకు గమ్మత్తయిన టైటిల్స్ కె ఓటేస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలకు చిత్రవిచిత్రంగా ఊరి పేర్లనే, సినిమా టైటిల్స్ గా పెట్టేశారు. మరి ఊరి పేర్లను పెట్టుకున్న ఆ సినిమాలు ఏంటో, వాటి రిజల్ట్ ఏంటో మీరే ఓ లుక్కేయండి.
Also Read: తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లు అయిన హీరో,హీరోయిన్లు?
#కేరాఫ్ కంచరపాలెం:
కంచరపాలెం ఊర్లోని జనాల మధ్య జరిగిన సంఘటనలని సినిమా రూపొందించాడు వెంకట్ మహా! ఊరి పేరు నే టైటిల్ గా పెట్టి హిట్ కొట్టాడు.
#గంగోత్రి:
Advertisement
అల్లు అర్జున్ డేబ్యు మూవీ గంగోత్రి. పవిత్ర పుణ్యక్షేత్రమైన గంగోత్రి బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా నడిచింది. కాబట్టి ఈ సినిమాకు గంగోత్రి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
#బొంబాయి:
బొంబాయి మత గొడవలను ఇతివృత్తంగా తీసుకొని మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్టోరీ బొంబాయి నేపథ్యంలో తీశారు కాబట్టి టైటిల్ కూడా బొంబాయి.
Also Read: కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?
#భీమిలి కబడ్డీ:
ఇతివృత్తంగా నాని హీరోగా చేసిన ఈ సినిమా కూడా హిట్. ఈ సినిమాలో నాని భీమిలి కబడ్డీ జట్టులో సభ్యుడు కాబట్టి సినిమాకు అదే పేరును పెట్టారు.
#హనుమాన్ జంక్షన్:
ఏలూరి దగ్గర హనుమాన్ జంక్షన్ చాలా ఫేమస్, ఇదే పేరుతో జగపతిబాబు, అర్జున్, వేణులు హీరోలుగా వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అరుణాచలం, భద్రాచలం, అన్నవరం సినిమాలు కూడా ఊరి పేర్ల మీదే ఉన్నాయి.
A lso read: నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు.!