Advertisement
మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు యువ దర్శకుడు వశిష్ట.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన బింబిసారా మూవీ ఆగస్టు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ సినీ జీవితంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ సక్సెస్ కోసం దర్శకుడు వశిష్ట చాలానే కష్టాలు పడ్డారని చెప్పవచ్చు.. చివరికి తన పేరు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
Advertisement
సాధారణంగా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు పరిస్థితి ఒకలా ఉంటే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారి పరిస్థితి మరోలా ఉంటుంది… కానీ బ్యాగ్రౌండ్ అనేది జస్ట్ బూస్టింగ్ అని నిరూపించారు దర్శకుడు వశిష్ట . అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ ఉన్న పుత్రరత్నాలు కూడా హిట్ కాలేకపోతున్నారు.. కానీ వశిష్ఠ అలా కాదు గెలుపు అయినా ఓటమి అయినా ఇక్కడే అనుకొని చివరికి తాను అనుకున్న రంగంలోకి దిగి విజయాన్ని అందుకున్నాడు.. అయితే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన బింబిసార మూవీ కథ ముందుగా చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళింది. ఇందులో ఈ మూవీ కథను స్టార్ హీరో రవితేజ మాత్రం రెండు సార్లు కూడా విన్నారట.
Advertisement
కానీ రవితేజ మాత్రం కమర్షియల్ కథ సెట్ కాదని చెప్పారట. ఈ కథపై రవితేజ కు చాలా డౌట్స్ వచ్చాయి.. బిజీ షెడ్యూల్ ఉండొచ్చు.. అందుకే నాతో సినిమాకి ఒప్పుకోలేదు.. కానీ చివరికి ఈ కథను కళ్యాణ్ రామ్ కి వినిపించారు.. కళ్యాణ్ రామ్ కి కూడా నాకు పాత్రలు అంటే చాలా ఇష్టం.. నేను కూడా ఇలాంటి కథల కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పేశారట.. దీంతో సినిమా చేయడానికి దర్శకుడు వశిష్టకు ధైర్యం వచ్చింది. సినిమా పూర్తి చేశారు. థియేటర్లోకి వచ్చి కళ్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు.. కానీ ఈ సినిమాను రవితేజ రిజెక్ట్ చేశారు.. అయితే ఈ మూవీను రవితేజ చేసుంటే ఇంకోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాలుగో తరం వారసులు ఎవరో మీకు తెలుసా..?