Advertisement
వరుస ఫెయిల్యూర్స్ తో విసుగెత్తిపోయిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. బలమైన కథతో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లో బాగా రన్ అవుతోంది. ఆగస్టు 5న రిలీజ్ అయిన ‘బింబిసార’ అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఓకే అనిపిస్తోంది. ఇప్పటికే చిత్రం పై ఆడియన్స్ పాజిటివ్ గా స్పందిస్తుండడంతో పాటు, అటు సినీ తారలు క్లాసికల్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘బింబిసార’ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే పెట్టుబడిని మాత్రం రాబట్టింది.
Advertisement
READ ALSO : ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?
Advertisement
ఇది ఇలా ఉంటే రెండేళ్ల గ్యాప్ లో బాహుబలి 1, బాహుబలి 2 విడుదల కాగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు పార్టులుగా తిరకెక్కించినట్లు ప్రకటించారు. ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్ మారుమ్రోగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 1 తో సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, త్వరలో పార్ట్ 2 షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. మొదట ఒక పార్ట్ గా పుష్పను తెరకెక్కించాలని అనుకున్న సుకుమార్ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
మల్లీడి వశిష్టు సైతం బింబిసార సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు. బింబిసార పార్ట్1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బింబిసార 2 ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ పార్ట్ 1 విడుదలై సక్సెస్ సాధించిన తర్వాతే పార్ట్ 2 తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం. బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?