Advertisement
టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన సినిమా విశేషాలతో పాటు, కుటుంబ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. అయితే, అల్లు అర్జున్ తాజాగా తన తాత అల్లు రామలింగయ్య ఫోటోని పంచుకున్నారు. పైన గోడకి తాత ఫోటో వేలాడుతుంది. దాన్ని కింద నుంచి కెమెరాతో క్లిక్ మనిపిస్తున్నట్టుగా ఉంది ఫోటో.
Advertisement
ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ సింపుల్ గా ఓ క్యాప్షన్ ఇచ్చారు బన్నీ. ఇందులో ఆయన ‘మా ఫౌండేషన్’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ట్రెండ్ చేస్తున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ ‘యాష్ ట్యాగ్’ ట్రెండ్ అవుతుంది. ఇందులో ఆయనతో పాటు#AANo1Choice యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ‘
‘ చిత్రంలోని ఆయన డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో కూడిన ఫోటోని మిక్స్ చేసి ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ నంబర్ వన్ ఛాయిస్ అని చాటి చెబుతున్నారు అభిమానులు.
Advertisement
అయితే ‘పుష్ప’ చిత్రంతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. దీంతో ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ ఓ బ్రాండ్ గా ఎదిగారని, అనేక బ్రాండ్ లకి ఆయన ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నారని అంటున్నారు. దీంతో అల్లు అర్జున్ (ఏఏ) ఓ బ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇలా ఇప్పుడు ట్విట్టర్ లో అల్లు అర్జున్ పేరు మారు మోగిపోతుంది. ఇది ఇలా ఉంటే బన్నీకి వ్యతిరేకంగానూ కొన్ని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. నెగటివ్ కామెంట్లు సైతం ట్రెండ్ కావడం గమనార్హం.
కారణం ఆయన పంచుకున్న పోస్టు. తాత అల్లు రామలింగయ్య ఫోటోని పంచుకొని ఆయన తమ ఫౌండేషన్ అని పేర్కొనడంతో యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పాత వీడియోలు, క్లిప్ లను పంచుకుంటూ ఆడుకుంటున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. మొదటినుంచి తమ ఫ్యామిలీకి పునాది వేసింది చిరంజీవి పేరు చెప్పుకుంటూ వచ్చావని, చిరంజీవి వల్లే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని ఆయన చెట్టు కింద పిల్ల మొక్కలం అంటూ చెప్పుకొచ్చిన బన్నీ, ఇప్పుడు మాట మార్చారని అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక్క హిట్ వస్తే అన్ని మార్చేస్తారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకప్పుడు మావయ్య చిరంజీవి వల్లే ఇండస్ట్రీకి వచ్చానని, ఇప్పుడు మా అల్లు ఆర్మీ సపోర్ట్ వల్లే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకుంటున్నారంటూ మీమ్స్ తో ఆడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా హీటెక్కి పోతుందని చెప్పొచ్చు.
READ ALSO : ఒకే మ్యాచ్ లో ఎక్కువ వికెట్లు తీసిన వీరులు వీళ్ళే !