Advertisement
“సన్నాఫ్ సత్యమూర్తి” మూవీ చూస్తే మనకు మొదట గుర్తుకు వచ్చేది, హీరో అల్లు అర్జున్ తో కలిసి నటించిన బుల్లి పాప. అయితే బేబీ వెర్నికా తన బుల్లి మాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంలో కూడా నటించి అలరించింది. అయితే ఇంతకీ ఈ చిన్నారికి పెద్ద పెద్ద చిత్రాల్లో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అయితే ఇక అమ్మాయి చదువు పాడు కాకూడదు అని ఆమె తల్లి తండ్రులు సినిమాలు మానిపించేశారు.
Advertisement
ఇక ఇది ఇలా ఉండగా బేబీ వేర్నికా గురించి ఇటీవల బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇక, వేర్నికా తల్లిగారి పేరు జయ, తండ్రి గారి పేరు ప్రసాద్, వీళ్ళిద్దరికీ ఒక్కగానొక్క కూతురు ఈమె. అయితే వేర్నికా తల్లి జయ అప్పట్లో వేర్నికా ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. ఆమె వేర్నికా ఫోటో అప్లోడ్ చేసిన ప్రతిసారి వాటికి వేల లైకులు మరియు షేర్లు వచ్చేవి. ఇక అలా ప్రతిరోజు వైరల్ అవుతున్న వేర్నికా ఫోటోలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దృష్టిలో పడింది.
Advertisement
అయితే వేర్నికా ఫోటోలను చూసి ఎంతో నచ్చిన త్రివిక్రమ్ స్వయంగా వెర్నికా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఒప్పించి, ఆ సినిమాలో నటింప చేశారు. ఇక ఆ సినిమా నుండి వెర్నికా కి మంచి క్రేజ్ ఏర్పడింది. నాన్నకు ప్రేమతో చిత్రంలో కూడా బేబీ వేర్నికా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిన్ననాటి పాత్రలో ఇమిడిపోయి నటించింది. అయితే ఆ తర్వాత ఎన్ని సినిమా చాన్సులు వచ్చినా పాప తల్లిదండ్రులు చదువు పాడైపోతుంది, అనే భయంతో సినిమాలకు నో చెప్తున్నారు. ఇక ఏమైతేనేమి బాలనటిగా బేబీ వేర్నికా నూటికి నూరు మార్కులు సంపాదించిందని చెప్పవచ్చు.