Advertisement
‘మురారి’ చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’, ‘బాబి’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో 2003 వ సంవత్సరంలో ‘ఒక్కడు’ మూవీ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. పోటీగా ఎన్టీఆర్ ‘నాగ’, రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, శ్రీకాంత్ – వేణుల ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం.
Advertisement
కాగా, ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ సినిమా కథను దర్శకుడు గుణశేఖర్ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి రాయడం మొదలు పెట్టారట. ఇక రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో, గుణశేఖర్ చిరంజీవితో చూడాలని ఉంది సినిమా నిర్మిస్తున్నారట. అప్పుడు మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయంతో గుణశేఖర్ కథలో వినిపించగా, వెంటనే మహేష్ కథ నచ్చింది అని ఓకే చెప్పేశారట. ఈ సినిమా విషయంలో ఇద్దరు నిర్మాతలు పక్కకు తప్పుకోవడంతో ఎమ్మెస్ రాజు ఫ్రేమ్ లోకి వచ్చారట.
Advertisement
కాగా 2003 లోనే 14 కోట్ల రూపాయలతో ఒక్కడు సినిమా తెరకెక్కింది. సినిమా తొలి రోజు తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్యం అన్న టైటిల్ పెట్టాలని అనుకున్నారు. అయితే అప్పటికే ఆ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో గుణశేఖర్ ఎంత బతిమిలాడిన ఒప్పుకోలేదు. ఆ తర్వాత కబడ్డీ అన్న పేరు అనుకున్నారు. చివరకు గుణశేఖర్ ‘ఒక్కడు’ అన్న టైటిల్ చెప్పిన వెంటనే మహేష్ ఓకే చెప్పేశారు. అలా ఒక్కడు సినిమా టైటిల్ పుట్టి మహేష్ కెరియర్ ను మార్చేసింది.
Read Also : Laal Singh Chaddha Review : లాల్ సింగ్ చడ్డా రివ్యూ..