Advertisement
ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలనటుడిగా అద్భుతమైన పాత్రలో నటించి తర్వాత ఇండస్ట్రీకి దూరమై కొంత మంది వివిధ పనుల్లో సెట్ అయిపోతూ ఉంటారు. కొంతమందేమో బాలనటుడిగా చేసి తర్వాత కూడా ఇండస్ట్రీలోనే హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సెట్ అవుతుంటారు..
Advertisement
అయితే అలా చిన్నతనంలో సినిమాల్లో చేసి కొన్నేళ్లు ఎవరికీ కనపడకుండా ఉండి మళ్లీ ఏదో ఒక విధంగా బయటకు వచ్చినప్పుడు వారిని చూస్తే మనమంతా ఆశ్చర్యపోతాం.ఈ మాదిరిగానే బాలనటిగా జయం సినిమాలో నటించి మెప్పించిన అమ్మాయిని ఇప్పుడు చూస్తే షాక్ అవ్వడం ఖాయం.. ఇంతకీ ఆమె ఎవరో వివరాలు చూద్దాం.. అగ్ర దర్శకుడు తేజ దర్శకత్వంలో లవ్ బేస్ సినిమా జయం..
ఈమూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. నితిన్ హీరోగా, సదా హీరోయిన్ గా, గోపీచంద్ విలన్ పాత్రలో ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో ముఖ్యంగా సదా చెల్లెలి పాత్రలో చేసిన అమ్మాయి పాత్ర మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె అక్షరాలు తిప్పి రాయడంతో హైలెట్ గా నిలిచింది.. ఆ పాపకు ఈ పాత్ర కి గాను నంది అవార్డు కూడా వచ్చింది.. ఆ పాప పేరు యామిని శ్వేత.. ఈమె ప్రముఖ సీరియల్ నటి జయలక్ష్మి కూతురు. ఈ మూవీ కంటే ముందు యామిని కొన్ని డైలీ సీరియల్స్ లో నటించింది.
Advertisement

ALSO READ:
ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?





