Advertisement
గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ ఫాన్ ఇండియా హిట్ సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.. ఈ తరుణంలో బాలీవుడ్ లో అంతా ఆశలు పెట్టుకున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా కథనం మందకొడిగా ఉన్న, సోషల్ మీడియాలో లాల్ సింగ్ చద్దానీ బహిష్కరించడం కూడా సినిమా అతి తక్కువ కలెక్షన్లకు కారకంగా మారింది అని చెప్పవచ్చు. దీంతో బాలీవుడ్లో హిట్ కొట్టడం కోసం ఒక్క పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రపై ఆశలు పెట్టుకున్నారు..
Advertisement
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ నటించారు. బ్రహ్మాస్త్రా ఈ ఏడాది అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రాలలో ఒకటి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఫాంటసీ డ్రామాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో ఒక వర్గం బైకట్ కు పిలుపునివ్వడంతో ఈ మూవీ సమస్యల్లో పడింది. సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు “బ్రహ్మాస్త్రాన్ని బహిష్కరించండి” అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు.
Advertisement
ఈ బహిష్కరణకు ప్రధాన కారణం ఏమిటంటే, ఈ చిత్రంలో సుశాంత్ ప్రధాన పాత్రలో మొదటి ఎంపిక అని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే కరణ్ జోహార్, ఆశ్రిత పక్షపాతమే సుశాంత్‌ను ప్రాజెక్ట్ నుండి తప్పించింది. ఈ మూవీ అవకాశం మిస్ చేసుకోవడం వల్ల సుశాంత్ ఆత్మహత్యకు ముందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడనే ప్రచారం సాగిన నేపథ్యంలో ఈ మూవీని బై కట్ చేయాలని ఒక వర్గం డిసైడ్ అయింది. అయితే సినిమా కథ మరియు దర్శకత్వం బాగుంటే మూవీని ఎవరు ఆపలేరు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ALSO READ;
హిట్ సినిమాలు చేతులారా.. మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే ?