Advertisement
నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 22వ తేదీ సోమవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
Advertisement
మేష రాశి:
ఈరోజు కుటుంబ జీవితంలో అస్థిరత ఉండవచ్చు. మీ తల్లిదండ్రులతో మీకు కొన్ని సైదాంతిక విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. జీతభత్యాలు కష్టపడి పై అధికారులను సంతృప్తి పరచగలరు.
వృషభ రాశి:
ఈరోజు మీకు మంచి రోజు కానుంది. ఈరోజు మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ పట్ల పెద్దల ప్రేమ అలాగే ఉంటుంది. పిల్లలు కూడా మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు.
మిధున రాశి:
కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపార ఒప్పందాలు తెరపైకి రావచ్చు. సమస్యలను ఎదుర్కోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆఫర్ ను కూడా పొందవచ్చు. పనిని తెలివిగా ప్రారంభించండి. త్వరలో మీ పని పూర్తవుతుంది. రోజువారి పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఉండవు.
కర్కాటకం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. నూతన ప్రయోగాలు, సాహసకృత్యాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
సింహం :- మీ సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. మీరెంతగానో ఆందోళన చెందిన ఒక సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రయోజనమైన ఖర్చులే ఉంటాయి.
కన్య :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. బదిలీపై వచ్చిన ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలకు అయిన వారి ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. వాహనం నిదానంగా నడపటం మంచిది.
Advertisement
తుల :- విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కళ, క్రీడ, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహకరం. కుటుంబీకుల కోసం బాగా శ్రమిస్తారు. ధనమూలకంగా సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ఇబ్బందులెదుర్కుంటారు.
వృశ్చికం :- ఉద్యోగస్తులు, అధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కార ఉంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. సంతకాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి.
ధనస్సు : – మీ అభిప్రాయాలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కొన్ని విషయాల్లో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. చక్కని ఆలోచనలు, మంచి ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు.
మకరం :- దైవ, సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడుల విషయంలో ఏకాగ్రత ముఖ్యం. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
కుంభం :- బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. గత సంఘటనలుపదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందిస్తారు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించటం మంచిది. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు.
మీనం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి : 2022లో నిర్మాతలు & డిస్ట్రీ బ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చిన తెలుగు సినిమాలు ఇవే !