Advertisement
మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ అంటేనే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన ఆయన, టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే గాడ్ ఫాదర్ గా మారారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు అన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ, ఆయన గురించి, ఆయన రికార్డుల గురించి మాత్రం ఈ తరం వారికి పెద్దగా అవగాహన లేదు.
Advertisement
ఇది ఇలా ఉండగా ఒక సినారియోలో కేవలం 29 రోజుల్లోనే ఒక సినిమాను తీసి విడుదల చేయడం అనేది నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయం. కానీ అలా జరిగింది కేవలం 29 రోజుల్లోనే మెగాస్టార్ అంటే హీరోని పెట్టుకుని ఒక సినిమా తీసి విడుదల చేసి హిట్టు కొట్టారు ప్రొడ్యూసర్ కె.రాఘవ. ఇక సినీ ఇండస్ట్రీకి రాఘవ ఇచ్చిన రెండు అద్భుతమైన కానుకలు ఒకరు దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు, మరొకరు కోడి రామకృష్ణ. దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ కానీ వీరిద్దరిలో ఉన్న టాలెంట్ ని గమనించిన రాఘవ వీరికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహించారు.
Advertisement
దాసరినే తాత మనవడు సినిమాతో ఇండస్ట్రీకి తీసుకురాగా, కోడి రామకృష్ణను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశాడు రాఘవ. ఇక “ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య” సినిమా కేవలం 29 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని 500 రోజులకు పైగా ఆడి ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో మాటల రచయితగా ఉన్న గొల్లపూడి ని నటుడిగా కూడా పరిచయం చేశారు. రాఘవ ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా మాధవి నటించింది. ఇక ఈ చిత్రంలో ఇంట్లో భార్య అంటే ఎంతో గౌరవం ఉండి, బయటకు వెళ్ళగానే చిలిపి కృష్ణుడిగా అవతారం మార్చే రాజశేఖర్ పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించాడు.
ఇవి కూడా చదవండి: సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు