Advertisement
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది. రెండు రాష్ట్రాల్లో సమర్ధవంతమైన క్యాడర్ ఉన్నా సరే… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్యాడర్ వైసీపీ వైపు చూడటంతో అక్కడ పార్టీకి అభ్యర్ధులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇక తెలంగాణా విషయానికి వస్తే… భిన్నమైన పరిస్థితులు కనపడుతున్నాయి. క్యాడర్ సమర్ధవంతంగా ఉండటం, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బలమైన నాయకత్వం ఉండటంతో పార్టీ… అధికార తెరాసను ఇబ్బంది పెడుతుంది.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
అయితే ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వస్తున్నా సరే కొంతమంది బలమైన నాయకులు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ప్రధానంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి… పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా సరే తాను మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగానే ఉన్నారు. కొందరు ఆయనను సాగనంపే ప్రయత్నాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నా సరే… సొంత బలాన్ని నమ్ముకుంటూ, అధిష్టానానికి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ముందుకి వెళ్తున్నారు.
Advertisement
అయితే త్వరలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికకు స్టార్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డికి అధిష్టానం కీలక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఆయనకు కీలక పదవితో పాటుగా కొన్ని బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ అగ్ర నేత ప్రియాంకా గాంధీతో ఆయన ఢిల్లీలో సమావేశం అయిన సందర్భంగా పార్టీ పరిస్థితిని వివరిస్తూ… మునుగోడు వాస్తవ పరిస్థితిపై క్షేత్ర స్థాయి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
కోవర్ట్ లకు సంబంధించి జాబితాతో పాటుగా… పార్టీ మారే నాయకుల లిస్టు కూడా ప్రియాంకా ముందు సాక్ష్యాలతో సహా ఉంచినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల ఎంపికకు సంబంధించి కూడా ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నమ్మకమైన, బలమైన అభ్యర్ధుల జాబితాను సిద్దం చేసుకుని మూడు నెలల్లో అధిష్టానానికి ఇవ్వాల్సిందిగా ప్రియాంకా సూచించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణతో పాటుగా దక్షిణాది కోసం ఏర్పాటు చేయబోయే కీలక కాంగ్రెస్ కమిటీలో కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!