Advertisement
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభలు, పాదయాత్రలో మునుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ప్రజా దీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ 21వ తేదీన జరిగింది. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి.
Advertisement
ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప ఎన్నికల ప్రచారం కు వెళ్తానని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే వెంటనే ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత ముల్లు బట్టి విక్రమార్కతో తన నివాసంలో భేటీలో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై చర్చించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నేను ఎవరి పేరు సూచించానో మీడియాకు చెప్పలేనని అది పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు.
Advertisement
అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తారని తెలిపారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ప్రియాంక గాంధీతో పాటు సిఎల్పీ నేత బట్టి విక్రమార్కకు కూడా చెప్పానని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దాదాపు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో జరిగిన కసరత్తుపై కోమటిరెడ్డి కి వివరించానని బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ఆశావహుల పేర్లను తెలియజేశానన్నారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు ?