Advertisement
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పోతే అటు తండ్రితో, ఇటు అబ్బాయితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఇక వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ముంబై కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది.
Advertisement
ఇక ఇటీవల ప్రెగ్నెన్సీ కారణంగా ఆచార్య, ది గోస్ట్ లాంటి సినిమాలను కోల్పోయింది కాజల్. అంతేకాదు, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా వదులుకుంది. అదే అఖండ సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడిగా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ముందుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.
Advertisement
బోయపాటి వెళ్లి కాజల్ కు కథ కూడా చెప్పారు. అయితే కాజల్ అప్పుడు కొన్ని కమిట్మెంట్లతో బిజీగా ఉండడంతో బాలయ్య అఖండను రిజెక్ట్ చేసింది. అలా బాలయ్య-కాజల్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా మిస్ అయింది. అయితే ఈ మంచి సినిమా మిస్ అయిపోయానని కాజల్ ఇప్పటికీ సన్నిహితుల వద్ద ఫీల్ అవుతూ ఉంటుందట. ఈ ముదురు ఏజ్ లో ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించి ఉంటే చివరి దశలో కాజల్ కెరీర్ మరి కొంతకాలం పొడిగి ఉండేది. మరిన్ని మంచి ఛాన్సులు వచ్చేవి.
Read also : లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ గెలుపు కోసం ఏం చేసారో తెలుసా ?