Advertisement
ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి హీరోయిన్ గా తిరకెక్కించిన పెళ్లి చిత్రం అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.
Advertisement
ఇక ఆ తర్వాత ప్రేమించే మనస్సు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి వంటి సినిమాలు నవీన్ కి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇతను ఎంత వేగంగా తన కెరీర్ లో ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడని చెప్పవచ్చు. వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే నవీన్ వివాహం చేసుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరుని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల రీత్యా వడ్డే నవీన్, చాముండేశ్వరి విడిపోయారు.
Advertisement
అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డానని, పలువురు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఆ తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరగా నాలుగేళ్ల కిందట మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాల్లో కనిపించారు వడ్డే నవీన్. అసలు వడ్డే నవీన్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదని, ఉన్నట్టుండి సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నాడని పలువురు చర్చించుకోవడం విశేషం.