Advertisement
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి, క్రికెటర్లకు వచ్చి పడే డబ్బు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ వచ్చాక క్రికెటర్లు రాత్రికి రాత్రి కోటీశ్వరులు ఎలా అయిపోతున్నారో ప్రపంచమంతా చూస్తోంది. కేవలం ఐపిఎల్ మాత్రమే కాక, భారత క్రికెటర్లకు భారీ స్థాయిలో ఎండార్స్మెంట్ డీల్స్ కూడా ఉంటాయని అందరికీ తెలుసు. ఇండియాలో క్రేజ్ ఉన్న క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక డబ్బును సంపాదిస్తున్న అథ్లెట్స్ గా నిలుస్తున్నారని కూడా జగమెరిగినదే. అయితే, ఆటగాళ్ల ప్రదర్శన బట్టి కోటి నుంచి 7 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది బీసీసీఐ. ప్రస్తుత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో 27 మంది క్రికెటర్లు ఉన్నారు.
Advertisement
ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి A+, A, B&C.. అను నాలుగు కేటగిరిలుగా విభజించారు. ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్స్ కు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, సి గ్రేడ్ ప్లేయర్లకు కోటి రూపాయల వేతనం అందుతుంది. ఇక మ్యాచ్ ఫీజులు టెస్టులకు రూ. 15 లక్షలు, వన్డేలకు 6 లక్షలు, టీ20 లకు 3 లక్షలు ఇస్తున్నారు. ఇక, ఆటగాళ్లు సెంచరీ చేసిన లేదా 5 వికెట్లు తీసిన మరో రూ. 5లక్షలు, డబుల్ సెంచరీ చేస్తే రూ. 7 లక్షలు అదనంగా ఇస్తున్నారు. వీటికి ఐపీఎల్ డబ్బులు అదనం.
Advertisement
#ఆటగాళ్లు-వారి జీతాలు:
1. రూ. 7కోట్లు:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ట్ప్రీత్ బూమ్రా.
2. రూ. 5కోట్లు:
కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ షమీ.
3. రూ. 3 కోట్లు:
అంజిక్య రహనే, ఇశాంత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, చటేశ్వర్ పూజార, మహమ్మద్ సిరాజ్, అక్సర్ పటేల్, శ్రేయస్ అయ్యర్.
4.కోటి రూపాయలు:
షికార్ ధావన్, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుబ్ మాన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్.
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!