Advertisement
టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1 బాహుబలి 2:
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తేరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తెలుగు తో పాటు పాన్ ఇండియా లెవెల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.195 కోట్ల బిజినెస్ చేస్తే, రూ.352 కోట్ల షేర్ లాభాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల బిజినెస్ చేస్తే, రూ. 860కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.860 కోట్ల షేర్ సాధించింది.
#2 RRR:
అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మరు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్ గా రూ. 111.41కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 272.31 కోట్లు షేర్ వసూళ్లను సాధించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.613.06 కోట్లు షేర్ సాధించాయి. ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 163.03 కోట్ల లాభాలతో మూడో స్థానంలో ఉంది.
#3 అల వైకుంఠపురంలో:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన అల వైకుంఠపురంలో తేరకెక్కిన ఈ మూవీ రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ చిత్రం 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ . 75.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా 2020లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
#4 గీత గోవిందం:
Advertisement
విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. అర్జున్ రెడ్డి కథను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్, ఆ తర్వాత గీత గోవిందం కథ కూడా కాదు అనుకున్నాడు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చింది. అందుకు కూడా చేయలేకపోయాడు బన్నీ. ఇదే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు పరశురాం. రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 70 కోట్ల షేర్ తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
#5 F2:
ఎఫ్2 అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఎఫ్ 2’ మూవీ. ఈ సినిమా రూ.34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 80 కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ సినిమా రూ. 50 కోట్ల లాభాలను తీసుకువచ్చింది.
రంగస్థలం:
రామచరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘రంగస్థలం’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. హీరో రామ్ చరణ్, దర్శకుడు: సుకుమార్, ఫస్ట్ వీక్ ఏపీ షేర్: రూ. 58.98 కోట్లు షేర్ సాధించింది. ఓవరాల్ గా రూ. 122.37 కోట్ల వసూళ్లు సాధించింది.
సరిలేరు నీకెవ్వరు:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలైంది. రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్ గా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
కార్తికేయ 2:
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటివరకు రూ. 36కోట్ల షేర్ లాభాలను తీసుకొచ్చింది. అంతే కాదు ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 10 లో నిలిచింది.
ఉప్పెన:
వైష్ణవ్, తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం రూ.51 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తొలి సినిమాతో ఈ మూవీ సంచలనం రేపింది. ఈ మూవీ రూ. 20.5 కోట ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే, రూ. 31.02కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
READ ALSO : వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !