Advertisement
చిరంజీవి వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అంజి. ఫాంటసీ కథతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో సినిమా తీశారు దర్శకుడు కోడి రామకృష్ణ.. ఈ మూవీ 2004లో సంక్రాంతికి థియేటర్లలోకి రాగా, సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే అదే సమయంలో సంక్రాంతికి బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ, ప్రభాస్ నటించిన వర్షం సినిమా లు వచ్చాయి.. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఫలితం ఈ రెండు సినిమాల కంటే వెనుకబడి పోయింది. ఈ చిత్రం యొక్క ఫలితం ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి ని ఆర్థిక ఇబ్బందులు లోకి నెట్టేసింది. అయితే ఈ సినిమా ఫలితంపై దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. చిరంజీవి ఠాగూర్, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మంచి ఊపు మీదున్నాడు.
Advertisement
also read:బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?
Advertisement
ఈ సందర్భంలోనే ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి చిరుతో అతిపెద్ద గ్రాఫిక్స్ మూవీ చేద్దామని డేట్స్ తీసుకున్నారట.. ఈ బాధ్యతను కోడి రామకృష్ణకు అప్పగించారట.. అయితే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో కమర్షియల్ సినిమా చేయడం మాత్రమే బాగుంటుందని, నా దగ్గర డ్యూయల్ రోల్ లో మంచి స్క్రిప్ట్ ఉందని అది చేద్దామని అన్నారట కోడి రామకృష్ణ. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి దానికి ఒప్పుకోలేదట.. ఎలాగైనా గ్రాఫిక్స్ మూవీ చేయాల్సిందే అని పట్టుబట్టారట..అయితే కోడి రామకృష్ణ మాత్రం చివరికి చిరంజీవి నా కన్విన్స్ చేద్దామని ఆయన్ని కలవగా చిరంజీవి కూడా గ్రాఫిక్స్ మూవీ చేద్దామని అన్నారట..
దీంతో కోడి రామకృష్ణ ఎంతో కష్టపడి చిరంజీవి కోసం ఫాంటసీ బ్యాక్ గ్రౌండ్ తో స్టోరీ సిద్ధం చేసి తెరకెక్కించారట.. అంజి మూవీ షూటింగ్ కోసం చాలా పరిశోధన చేసి చాలా కాలం తీసుకున్నారట. ఈ మూవీలో చిరంజీవి నష్టం అంతా ఇంతా లేదని, క్లైమాక్స్ సన్నివేశం కోసం చిరు ఒకే షర్ట్ ను తప్పకుండా రెండు సంవత్సరాలు వేసుకోవాల్సి వచ్చిందట. ఒక కొత్త ఆర్టిస్టుగా కష్టపడి నటించారు చిరంజీవి అని కోడి రామకృష్ణ తెలియజేశారు. దీనిపై పెట్టుకున్న భారీ అంచనాలే కొంపముంచాయని అన్నారు కోడి రామకృష్ణ.
also read:టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఇవే!