Advertisement
నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకునే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిద్య భరితమైన పాత్రలు ఎన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు.
Advertisement
అయితే తాజాగా ఒకప్పటి పెళ్లి పత్రిక ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పత్రిక కూడా మరెవరిదో కాదు, అన్నగారు ఎన్.టి.రామారావు బసవతారకంల వివాహ ఆహ్వాన పత్రిక. ఈ పత్రికలోని తెలుగు భాషా పదాలు కూడా కాస్త గ్రాంథిక భాషలో కనిపిస్తున్నాయి. కొమురవోలు అనే గ్రామంలో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పత్రికను గుడివాడలోని శ్రీ బాల సరస్వతి ప్రెస్ లో ముద్రించినట్టు కనిపిస్తోంది. ఇక 22-4-1942లో ఎన్.టి.రామారావు తన సొంత మరదలు అయిన బసవతారకంను వివాహం చేసుకున్నారు.
Advertisement
అప్పట్లో వీరిని అన్యోన్య దంపతులకు కొలిచేవారు. 1985లో బసవతారకం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య గుర్తుగా అన్నగారు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఎంతోమంది క్యాన్సర్ రోగులకు చికిత్సను అందిస్తున్నారు. అంతేకాకుండా విదేశాలలో ఉండే టెక్నాలజీతో ఈ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. తక్కువ ధరకే మందులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇబ్బందులు పడకుండా సహాయం చేస్తున్నారు.
Read also : ఫ్రిడ్జ్ లో ఈ పదార్థాలు పెడుతున్నారా ? అయితే.. మీ లైఫ్ కు ప్రమాదమే !