Advertisement
నందమూరి బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు తెర వెనుక ఒక ఆసక్తికరమైన కథ జరిగింది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరు కలిసి మన్వాసనై అనే తమిళ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.
Advertisement
ఆ సినిమాలో బాలకృష్ణ హీరోగా బాగుంటాడని అనుకున్నారు. ఆ టైం లో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ కు ముందు కథ చెప్పాలి.
అయితే కథ విన్న ఎన్టీఆర్ కు ఆ కథ ఎందుకో అంతగా నచ్చలేదట. అయినా బాలకృష్ణను కలిసి ఒకసారి కథ వినమని అడిగితే ఆయన కథ విని ఎన్టీఆర్ కు మరోసారి కథ వినమని చెప్పారట. ఫైనల్ గా ఎన్టీఆర్ మరోసారి కథ విని సినిమాలో బామ్మ పాత్ర పోషించిన నటి ఓఆత్ర నిడివి పెంచి భానుమతితో ఆ రోల్ చేయిస్తే సినిమా ఆడుతుందని సలహా ఇచ్చారట.ముందు భానుమతి చేయనని చెప్పినా ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆ పాత్రకు ఆమె ఒప్పుకున్నారట.
Advertisement
అయితే ఈ సినిమా మొదలుపెట్టే సమయంలో ఎన్టీఆర్, బాలకృష్ణకు మూడు కండిషన్స్ పెట్టారట. అందులో మొదటిది భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే నువ్వు షూటింగ్ స్పాట్ లో ఉండాలని అన్నారట. రెండోది ఆమె వచ్చినప్పుడు కారు దగ్గరకు వెళ్లి కారు డోర్ తీయాలని, ఆమె కిందకు దిగడాన్ని కాళ్లకు నమస్కారం చేయాలని, ఈ మూడు కండిషన్స్ పెట్టారట. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇలానే చేయాలని అన్నారట. ఎన్టీఆర్ చెప్పినట్టే బాలయ్య బాబు సినిమా అయ్యేంతవరకు అలానే చేస్తూ వచ్చాడు. ఒకసారి భానుమతి ఇలా చేయమని మీ నాన్న చెప్పాడా పెద్దలను గౌరవించే లక్షణం నీకుంది. పైకి వస్తావు అన్నారట. అలా చేసిన ఆ సినిమా మంగమ్మ గారి మనవడు ఆ సినిమాతో బాలకృష్ణ హీరోగా స్థిరపడ్డాడు.
Read Also : టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఇవే!