Advertisement
ఆసియా కప్ 2022 లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. లీగ్ దశలో వరసగా రెండు మ్యాచ్ గెలిచి సూపర్ 4 చేరిన రోహిత్ సేన, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో కంగు తిన్నది. ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. ఈ ఓటమికి కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టుంది టీమిండియా పరిస్థితి.
Advertisement
టీమిండియా ఓటమి కారణాలు:
#1 విఫలమైన మిడిల్డార్
ఓపెనర్లు రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ టీమ్ఇండియా కు మెరుపు ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలో బౌలర్ల పై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డారు. దీంతో టీమ్ ఇండియా 5 ఓవర్ల లోపే 50 పరుగులు పూర్తి చేసుకుంది. కానీ, ఇద్దరు ఓపెనర్లు మంచి టచ్ లో కనిపించిన ఎక్కువ సేపు క్రీజ్ లో నిలువ లేకపోయారు. ఒకరి వెంట మరొకరు వెంట వెంటనే అవుట్ అయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ, నిలకడగా ఆడుతున్న, మరో ఎండ్ లో టీమిండియా మిడిల్డార్ బ్యాటర్లు క్రీజ్ లో నిలవలేకపోయారు.
#2 కార్తీక్ లేని లోటు
జడేజా గాయంతో దూరం అవడంతో అతని స్థానంలో లెఫ్ట్ అండర్ గా రిషబ్ పంత్ ను కొనసాగించిన కెప్టెన్ రోహిత్, అనూహ్యంగా దినేష్ కార్తీక్ ను పక్కన పెట్టి దీపక్ హూడా ను జట్టలోకి తీసుకున్నాడు. ఈ నిర్ణయం చివరి ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. హూడా కూడా మంచి ఫామ్ లోనే ఉన్న అతను టాపార్డర్ బ్యాటర్. కానీ, పాక్ తో మ్యాచ్లో చివరి ఓవర్లలో బ్యాటింగ్ రావడంతో ఒక ఫినిషర్ రోల్ ను భర్తీ చేయలేకపోయారు.
Advertisement
#3 వీక్ బౌలింగ్ ఎటాక్
నిజానికి ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన బౌలింగ్ ఎటాక్ అంత పటిష్టంగా లేదనే విమర్శలు మొదటి నుంచే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ తేలిపోయారు. హాంకాంగ్ లాంటి పసికునను కూడా ఆల్ అవుట్ చేయకుండా, 152 పరుగులు సమర్పించుకున్నప్పుడు టీమిండియా బౌలింగ్ ఎటాక్ లో పసలేదని తేలిపోయింది. ఇప్పుడు పాక్ తో మరింత ప్రయోగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, దీపక్ హూడా పై అతి నమ్మకంతో కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాడు.
#4 చెత్త ఫీల్డింగ్
గత కొన్నేళ్లుగా ఫీల్డింగ్ లో ఒక రేంజ్ స్టాండేడ్స్ సెట్ చేసిన టీమిండియా ఆదివారం పాక్ తో జరిగిన మ్యాచ్ లో చేసిన ఫీల్డింగ్ మాత్రం నవ్వుల పాలు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్, రవి బిష్నోయ్ కొట్టిన రెండు షాట్లను చెత్త ఫీల్డింగ్ చేసి రెండు బౌండరీలు ఇవ్వడంతో ఇదేం ఫీల్డింగ్ రా బాబు అంటూ నవ్వుకున్న భారత అభిమానులు కీలక సమయంలో అర్షదీప్ సింగ్ వదిలేసిన క్యాచ్ తో ముక్కున వేలేసుకున్నారు.
#5 టాస్ ఓడిపోవడం
ఇక అన్నింటికంటే అతి ముఖ్యమైనది టాస్ ఓడిపోవడం. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ టాస్ ఓడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ తోలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ అంత కీలకం కాదని ఇరు జట్ల కెప్టెన్లు పై పై మాటలు చెప్పిన, మ్యాచ్ గడుస్తున్న కొద్ది టాస్ ఎంత కీలకమో అర్థమైంది. పిచ్ బ్యాటింగ్ కు పూర్తి అనుకూలంగా ఉంది.రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు మరింత సహకరించింది.
Read also: “అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!