Advertisement
టాటా గ్రూపు మాజీ చైర్మన్ షాపూర్ జి పల్లంజి గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారులో ఉన్న మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే సైరస్ మిస్త్రి రోడ్డు ప్రమాదంలో మరణించడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సీట్ బెల్ట్, ఓవర్ స్పీడ్ కారణాలు
పోలీసులు అందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం, అతివేగం, రోడ్డును అంచనా వేయడంలో లోపమే కారు ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించారు. మృతులిద్దరూ సీటు బెల్టులు ధరించలేదని పోలీసులు వెల్లడించారు. చరోటి చెక్ పోస్ట్ లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు, ఈ విషయాన్ని గుర్తించారు. పాల్గర్ పోలీసులు కారు చెక్ పోస్ట్ ను మధ్యాహ్నం 2.21 గంటలకు దాటిందని, ఆ తర్వాత 20 కిలోమీటర్లు వెళ్లాక ప్రమాదం జరిగిందని కూడా గుర్తించారు. ప్రయాణ సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, అలాగే 20 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరుకుందని కూడా పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిందిలా,
Advertisement
సైరస్ మిస్త్రి ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు సూర్య నది వంతెనపై మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రమాదానికి గురైనట్లు తేల్చారు. మిస్త్రి, జహంగీర్ పండోలే వెనుక సీట్లలో ఉన్నారని, డారియస్ ముందు సీటులో అనాహిత, చక్రం వద్ద ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఓ మహిళ కారు నడుపుతూ ఎడమవైపు నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ప్రమాదం జరగగానే 10 నిమిషాల్లోనే ఆంబులెన్స్ వచ్చిందని, గాయపడిన ఇద్దరు వ్యక్తులను కారు నుంచి బయటకు తీసి ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అయితే మిగిలిన ఇద్దరు చనిపోయారు. సైరస్ తలకు గాయమైందని, అంతర్గత రక్తస్రావం జరిగిందని వారు వెల్లడించారు. ప్రాథమిక దశలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంల కనిపిస్తోందన్నారు. సమగ్ర విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి అన్నారు.
READ ALSO : “అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!
Shocked to learn about untimely demise of kind hearted #CyrusMistry
My questions:
1. Why was he traveling by a car for 10 hours journey?
2. Why the Mercedes airbags didn't saved him?
Is there any conspiracy behind these accident? pic.twitter.com/yTKQg0HTE8— AB 🇮🇳 (@AB_Mayrastra) September 4, 2022
Airbag is deployed. Maybe he was sitting in the backseat without Seatbelt. pic.twitter.com/Z8xg2mTn5a
— Shiva Karthika🇮🇳 (@shivakarthika15) September 4, 2022