Advertisement
ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ఆయన డబ్బులు పొదుపు చేయడం, ఖర్చు ఎలా చేయాలి అనే విషయాలను చెప్పారు. వీటితో పాటుగా మన డబ్బు ఏ ప్రదేశాలలో ఖర్చుపెడితే మళ్లీ అది రెట్టింపు అవుతుంది అనే విషయాలను కూడా వెల్లడించారు.సాధారణంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం రక్షాబంధన్ రోజున సోదరులు సోదరికి బహుమతులు లేదా డబ్బులు ఇస్తూ ఉంటారు.
Advertisement
also read:2022 నుంచి ఇప్పటి వరకు TRP రేటింగ్ లో దుమ్ములేపిన సినిమాలు
మనం సోదరి కోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తామో సోదరుడికి అంత ప్రయోజనం చేకూరుతుందని చాణక్యుడు అంటారు. ఇది మీ ఆదాయం రెట్టింపు చేస్తుంది అని తెలియజేశాడు.అలాగే ఏదైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు మనం సహాయానికి వెనుకాడకూడదు. ఎందుకంటే మీరు చేసే సాయం ఎదుటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి, మీరు చేసిన సహాయం కంటే రెట్టింపు లాభాన్ని మీరు పొందుతారు.
Advertisement
అలాగే చాణక్య నీతి ప్రకారం ఏ మనిషి అయినా వారి యొక్క మతాన్ని గౌరవిస్తూ ఉండాలి. ఏదైనా మతపరమైన విషయంలో డబ్బు ఖర్చు చేసే సందర్భం వచ్చినప్పుడు అస్సలు ఆలోచించకుండా చేయాలన్నారు. దీంతో ఆ భగవంతుడు దయ మిమ్మల్ని ధనవంతున్ని చేస్తుందని ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు. కాబట్టి ఈ మూడు ప్రదేశాలలో లేదా ఈ మూడు విషయాలలో మనం డబ్బులు ఖర్చు చేస్తే మనకు రెట్టింపు ధనం వస్తుందని చాణిక్యుడు అన్నారు.
also read: