Advertisement
ప్రయాణాలు అంటే ఇష్టం లేనివారు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా. ప్రపంచంలో ఎంతోమంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. అయితే, సాధారణంగా ట్రైన్లలో, బస్సుల్లో, విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ పరిసరాలను గమనిస్తుంటాం. కానీ ఇటువంటి వాటిలో ప్రయాణించినప్పుడు అందులో ఉన్నటువంటి అలాగే మనం కూర్చునేటువంటి సీట్లు అన్ని ఒకే విధమైన రంగులో ఉంటాయి. ఆ కలర్ ఏమిటంటే “బ్లూ కలర్”.
Advertisement
అసలు ఈ సీట్లు ఎందుకు ఈ కలర్ లో ఉంటాయి అనే విషయం ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనం ప్రయాణం చేయడం వరకే మన పని అనే విధంగా ఉంటాము కాబట్టి. అలా అయితే ఇలా సీటు కవర్లు బ్లూ కలర్ లో ఎందుకు ఉంటాయంటే మనిషి సాధారణంగా ఒక్కొక్క రంగుని చూసినప్పుడల్లా, తమ మెదడు ఒక్కోలా పనిచేస్తుంది. ఇక ఎరుపురంగు చూసినప్పుడు అపాయంగా, తెలుపు రంగు చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
Advertisement
అలా రంగులు మార్చే కొద్ది మానవుని మెదడు ఒక్కోలా మారుతూ ఉంటుంది. మనం ఎక్కువసేపు ప్రయాణం చేయవలసి ఉంటుంది. కాబట్టి, మధ్యలో వచ్చేటువంటి చికాకులు, ఇసుగు వంటివి రాకుండా బ్లూ కలర్ ను చూస్తే మనిషి చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అందుచేతనే ప్రయాణాలు చేసే వారి కోసం ఇటువంటి వాటిలో ఎక్కువగా ఈ కలర్ ని వాడుతారు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని గమనించకపోయినట్లయితే ఈసారి జర్నీ చేసేటప్పుడు చూడండి. అంతేకాకుండా బ్లూ కలర్ ఉండటం వల్ల మనిషి బస్సులో కచ్చితంగా నిద్రపోతారు. ఎందుచేతనంటే ఈ కలర్ మెదడుపై బాగా పనిచేస్తుంది కావున. అందుచేతనే జపాన్ వంటి దేశాలలో ఈ కలర్ ను వీధిలైట్లగా కూడా వాడుతున్నారు.
READ ALSO : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…అసలు ఎందుకు అలా చేయాలి ?