Advertisement
పరిశ్రమలో ఏ సినిమాకు అయిన డైరెక్టర్ అనేవాడు హార్ట్. తన అద్భుత ఆలోచనలతో చక్కటి సినిమాలను తెరకెక్కిస్తాడు దర్శకుడు. హాలీవుడ్ డైరెక్టర్లు తమ జీవిత కాలంలో వేళ్ళ మీద లెక్కపెట్టేన్ని చిత్రాలను మాత్రమే రూపొందిస్తారు. ఒక సినిమాలో వాడిన క్యారెక్టర్స్ ను మళ్లీ రిపీట్ చేయకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. బాలీవుడ్ లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక టాలీవుడ్ వరకు వచ్చేసరికి ఈ పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే మొదటి సినిమా నుండి ఒక యాక్టర్ ని ప్రతి సినిమాలో చూపిస్తున్న దర్శకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
శ్రీకాంత్ అడ్డాల :
ఈయన సినిమాల్లోనూ రావు రమేష్ తప్పకుండా కనిపిస్తాడు. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాల్లో రావు రమేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు.
కృష్ణవంశీ:
ఈయన సినిమాల్లో ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు రెగ్యులర్ గా కనిపించేవారు. అందులో ఒకరు బ్రహ్మాజీ కాగా, మరొకరు దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ కృష్ణ.
రామ్ గోపాల్ వర్మ:
Advertisement
ఈయన సినిమాల్లో తనికెళ్ల భరణి ఎక్కువగా కనిపిస్తాడు. ఆర్జీవి తెరకెక్కించిన శివ, రక్త చరిత్ర, అప్పలరాజు, రౌడీ చిత్రాల్లో ఆయన నటించాడు.
రాజమౌళి:
రాజమౌళి తీసిన దాదాపు 90% సినిమాల్లో యాక్టర్ చంద్రశేఖర్ కనిపించాడు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఈగ వరకు అన్ని సినిమాల్లో చంద్రశేఖర్ నటించాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లోని ఇద్దరు నటలు రెగ్యులర్ గా కనిపిస్తారు. వారిలో ఒకరు అమిత్ అంకిత్ కాగా, మరొకరు ప్రభు.
హరీష్ శంకర్:
గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న హరీష్ శంకర్ సినిమాల్లోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రిపీట్ అవుతాడు. ఆయనే రావు రమేష్.
పూరి:
ఈయన సినిమాల్లో ఎక్కువగా సుబ్బరాజు కనిపిస్తాడు. పూరి దర్శకత్వంలో రూపొందిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, నేనింతే, గోలీమార్, దేవుడు చేసిన మనుషులు, బిజినెస్ మాన్, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో సుబ్బరాజు నటించాడు.
read also : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…అసలు ఎందుకు అలా చేయాలి ?